అంతర్జాతీయం

ముదురుతున్న షట్‌డౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 26: అమెరికా, మెక్సికో దేశాల మధ్య సరిహద్దుగోడ వివాదం కొనసాగుతోంది. ఈ గోడ నిర్మాణానికి అనవసరంగా నిధులు ఖర్చుపెట్టడం ఎందుకని, ఈ ప్రతిపాదనకు సహకరించేది లేదని డెమాక్రట్లు భీష్మించుకుని కూర్చున్నారు. తన పంతం నెరవేరాలని, గోడ నిర్మించి తీరుతామని అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మొండికేశారు. రిపబ్లికన్లు, డెమాక్రట్ల మధ్య గోడ గొడవలో ఉద్యోగులు నలిగిపోతున్నారు. ఉద్యోగులకు జీతాలు లేవు. క్రిస్మస్ పండగ చాలా చప్పగా గడిచింది. గత శుక్రవారం మూసివేసిన ప్రభుత్వ కార్యాలయాలు బుధవారం తెరుచుకున్నాయి. కాని ఉద్యోగాలకు వేతనాలు అందలేదు. దీంతో అమెరికాలో ఆర్థిక సంక్షోభం రానున్నరోజుల్లో ముదర నుంది. ఈ సమస్యకు కనుచూపు మేరలో పరిష్కారం లభిస్తుందనే ఆశ కనపడడం లేదు. ట్రంప్ మాత్రం వైట్ హౌస్‌లో కూర్చుని అలాస్కా, బహరెన్, గుమ్, ఖాతర్‌లో సైన్యం కేంద్రాల అధిపతులతో వీడియో కాన్ఫరెన్సును నిర్వహించారు. దేశంలోకి చొరబాటుదారులను రానివ్వకుండా ఉండాలంటే, డ్రగ్స్‌ను నిరోధించాలంటే, అక్రమ రవాణాను అరికట్టాలంటే గోడ నిర్మాణం తప్పదని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. గోడ బదులు ఫెన్సింగ్, ఆధునిక టెక్నాలజీ చాలని డెమాక్రట్లు అంటున్నారు. గోడ ఎందుకని, దీని వల్ల ఆర్థిక భారం పెరుగుతుందని, ఫెన్సింగ్‌తో సరిపెట్టుకుందామని డెమాక్రట్లు ముక్తకంఠంతో కోరుతున్నార. ఈ ప్రతిష్టంభన పరిష్కారం ఎలా అవుతుందనే అంశంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.