అంతర్జాతీయం

మళ్లీ సునామీ భయం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరిటా: హఠాత్తుగా విరుచుకుపడిన సునామీ పెను విలయం నుంచి ఇండోనేషియా ప్రజలు ఇంకా తేరుకోకముందే మరోసారి సునామీ భయం వారిని పట్టిపీడిస్తోంది. సునామీ రావడానికి కారణమైన సముద్రగర్భంలోని అగ్నిపర్వతం మళ్లీ బద్ధలై విరుచుకుపడవచ్చునని సంకేతాలు వెలువడటంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వాటి నుంచి వెలువడుతున్న వేడిగాలులు, బూడిద, ఇసుక వారిని వణికిస్తూ ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. అధికారులు సైతం అగ్నిపర్వతానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎవరూ ఉండరాదని ఆదేశాలు జారీ చేశారు. శనివారం రాత్రి హఠాత్తుగా విరుచుకుపడిన సునామీ వల్ల 430మందికి పైగా మృతి చెందగా, 1495 మంది గాయపడ్డారు. 159 మంది ఆచూకీ తెలియకుండాపోగా, సుమారు 22 వేలమంది తమ సొంత ప్రదేశాలను వదిలిపెట్టి షెల్టర్లలో తలదాచుకుంటున్నారు. సునామీలో మృతి చెందిన వారి సంఖ్య, చెల్లాచెదురైన వారి ఆచూకీ పూర్తిగా నిర్ధారణ కాకుండానే, పునరావాస చర్యలు ఇప్పుడిప్పుడే మొదలవుతుండగా, అగ్నిపర్వతం నుంచి వేడి వాయువులు, బూడిద, రాళ్లు, ఇసుక, ఇతర వ్యర్థపదార్థాలు గాలిలో నుంచి పరిసర ప్రాంతాలను ముంచెత్తున్నాయి. దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలు వదిలి బయటకు రావొద్దని, వీటివల్ల ఒళ్లు బొబ్బలెక్కడం, గాయపడటం జరగవచ్చునని అధికారులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చినా మాస్కులు, గ్లాసులు ధరించాలని డిజాస్టర్ ఏజెన్సీ ప్రతినిధి సుటోపో పుర్వో సూచించారు. ప్రస్తుతం అగ్నిపర్వత స్థితిని బట్టి రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్టు చెప్పారు. అగ్నిపర్వత విస్ఫోటన స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, మరో సీనియర్ అధికారి కుస్ హెండ్రాంతో గురువారం తెలిపారు. జావా, సుమత్రా దీవుల మధ్య సుందా జలసంధి మధ్య ఉన్న ఈ అగ్నిపర్వతం వల్ల సమీపంలోని పట్టణాలకు ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. అయితే స్థానికులకు ఎప్పుడు ఏమవుతుందోనన్న భయం నెలకొని ఉందని, మరోసునామీ వస్తుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారని, అందుకే వారు తమ స్వస్థలాలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని చెప్పారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చాయని, పునరావాస కార్యక్రమాలు చేపట్టి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఒక అధికారి తెలిపారు.