అంతర్జాతీయం

భూటాన్‌కు భారత్ సాయం రూ. 4,500 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: భూటాన్ దేశం 12వ పంచవర్ష ప్రణాళిక నిమిత్తం భారత్ 4,500 కోట్ల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ప్రకటించారు. భూటాన్‌తో జలవిద్యుత్ ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న సహకారంతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు మరింత బలపడ్డాయని పేర్కొన్న ఆయన భూటాన్‌లోని మాంగ్‌దెచ్చు ప్రాజెక్టు పనులు త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి విదేశీ పర్యటనలో భాగంగా వచ్చిన భూటాన్ ప్రధాని లౌటేషెరింగ్, భారత్ ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా భూటాన్‌కు భారత్ నమ్మకమైన మిత్రదేశమని మోదీ పేర్కొన్నారు. భూటాన్ అభివృద్ధిలో భారత్ ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపారు. అందులో భాగంగా భూటాన్ 12వ పంచవర్ష ప్రణాళిక నిమిత్తం భారత్ 4,500 కోట్లను సహాయంగా అందజేస్తుందని ప్రకటించారు. అంతకుముందు రాష్టప్రతి భవన్‌కు విచ్చేసిన భూటాన్ ప్రధానికి సాదర స్వాగతం లభించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఆయనను కలిసి ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలు ముఖ్య విషయాల్లో తమ భావాలను పంచుకున్నారు. రాజ్‌ఘాట్‌లోని మహాత్ముని సమాధి వద్ద భూటాన్ ప్రధాని నివాళి అర్పించారు.