అంతర్జాతీయం

కుదరని సయోధ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 28: మరో మూడురోజుల్లో కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్నా, అమెరికా, మెక్సికో దేశాల మధ్య గోడ నిర్మాణం వివాదం తేలలేదు. అటు దేశాధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్, ఇటు విపక్ష పార్టీ డెమాక్రట్ల మధ్య ఈ విషయమై సయోధ్య కుదరలేదు. ఎవరికి వీరు భీష్మించుకుని కూర్చోవడంతో సమస్య ముందుకు కదలడం లేదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా గోడ నిర్మాణం అంశం తయారైంది. ఈ వివాదం వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారు. మెక్సికో నుంచి అక్రమ వలసదారులను నిరోధించేందుకు గోడను నిర్మించాల్సిందేనని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. హౌస్ ఆఫ్ రిప్రెంజెంటేటీవ్స్‌లో డెమాక్రట్లకు మెజార్టీ ఉంది. సెనెట్‌లో వీరు మైనార్టీగా ఉన్నారు. సరిహద్దుగోడ నిర్మాణం వల్ల ఖజానాపై ఆర్థిక భారం పడుతుందని డెమాక్రట్లు అంటున్నారు. అధికార, విపక్ష పార్టీల మధ్య రాజీ కుదరకపోవడంతో, ఈ వివాదం కొత్త సంవత్సరంలో కూడా కొనసాగుతుందని రాజకీయ విశే్లషకుల అంచనా. వీరివివాదం వల్ల ఎనిమిది లక్షల మంది ఉద్యోగుల వేతనాలపై ప్రభావం పడింది. సరిహద్దు గోడ వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఇజ్రాయేల్ గోడ వల్ల 99.9 శాతం ప్రయోజనాలు లభించినట్లుట్రంప్ వాదిస్తున్నారు. డొనాల్ట్ ట్రంప్ విజయం సాధించరాదనే భావనతో ఉండవద్దని, దేశ భద్రత గురించి ఆలోచించాలని ట్రంప్ డెమాక్రట్లనుకోరారు. దేశంలోకి అక్రమ వలసలను, క్రిమినల్స్ ప్రవేశాన్ని నిరోధించాల్సిందేనని, రాజీలేదని ట్రంప్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఖర్చులను ఎలాభరిస్తామో, భద్రతతో కూడి ఉన్న గోడ నిర్మాణానికి నిధులను ఖర్చుపెట్టాల్సిందేనంటున్నారు. అమెరికా ప్రజల రక్షణకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. పరిపాలనాధికారులు కూడాగోడ నిర్మాణంవైపు మొగ్గు చూపుతున్నారని, డెమాక్రట్లు అర్థం చేసుకోవాలన్నారు.క్రిస్మస్ రోజు కూడా ట్రంప్ వేడుకలకు దూరంగా ఉండి దేశ భద్రత కోసం గోడ గురించి ఆలోచించారన్నారు. డెమాక్రట్లు మాత్రం భద్రత గురించి పట్టించుకోకుండా ఇంటికెళ్లిపోయారని వైట్ హౌస్ ప్రతినిధి పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ పంతం కోసం ఉద్యోగులను బలి చేయరాదని డెమాక్రట్లు విమర్శిస్తున్నారు. ట్రంప్ మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే చందంగా వ్యవహరిస్తున్నారని సెనెటర్ రిచర్డ్ బ్లూమెంథల్ అన్నారు.