అంతర్జాతీయం

నేడు బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, డిసెంబర్ 29: బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా భద్రతా బలగాలతో బందోబస్తును పటిష్టం చేశారు. ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా నాల్గవ సారి తనను ఎన్నుకోవాలని కోరుతూ విస్తృతంగా ప్రచారం చేశారు. ఆరులక్షల మంది పోలీసులు,పారామిలిటరీ బలగాలను సమస్యాత్మక ప్రాంతాల్లో మొహరించారు. ఆదివారం 10.41 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మైనార్టీలైన హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశారు. డిసెంబర్ 16 నుంచి 26 మధ్య జరిగిన మూడు ఘటనల్లో హిందువులపై దాడులు జరిగాయి. వారి ఇండ్లను దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో 3జీ, 4జీ టెలికమ్యూనికేషన్ సర్వీసులను నిలుపుదల చేశారు. 1971లో బంగ్లాదేశ్ అవతరించినప్పటి నుంచి ఇంతవరకు 11 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 40,183 పోలింగ్ స్టేషన్లలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అవామీలీగ్,బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీల మధ్య జరిగిన ఘర్షణలో 13 మంది కార్యకర్తలు మరణించారు. ప్రతిపక్ష పార్టీ పోలింగ్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చిన పక్షంలో ఓటింగ్ ప్రక్రియ నత్తనడకన సాగకుండా అప్రమత్తంగా ఉండి ప్రజలు ఓట్లు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని అవామీలీగ్ పార్టీ కార్యకర్తలను కోరింది.

చిత్రం..ఆదివారం జరగనున్న బంగ్లాదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటింగ్ పరికరాలను తరలిస్తున్న భద్రతా సిబ్బంది