అంతర్జాతీయం

బంగ్లాదేశ్ ఎన్నికలు రక్తసిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, డిసెంబర్ 30: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు రక్తసిక్తం మధ్య ముగిశాయి. దేశంలో చోటు చేసుకున్న వేరువేరు హింసాత్మక ఘటనల్లో 12 మంది మరణించారు. దేశంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఆరు చోట్ల ఉపయోగించడం విశేషం. 229 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆరు చోట్ల ఈవీఎంలను ఉపయోగించినట్లు బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న అవామీలీగ్, ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీలు అధికారం పీఠం దక్కించుకునేందుకు తలపడ్డాయి. ఉదయం 8 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి నిలబడి ఓటు హక్కును వినియోగించడం కనిపించింది. ప్రధానమంత్రి షేక్ హసీనా ఢాకా సెంటర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తానని, బంగ్లాదేశ్‌ను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని, ప్రజల ఆశీర్వాదం తమ పార్టీకి ఉంటుందని షేక్ హసీనా విలేఖర్లకు చెప్పారు. ప్రజల విశ్వాసం చూరగొంటానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఉజ్వల భవిష్యత్తుకోసం బంగ్లాదేశ్ ప్రజలు అవామీలీగ్‌కు పట్టం కడుతారన్నారు. వరుసగా నాల్గవ సారి ఆమె ఈ ఎన్నికల్లో గెలుస్తామనే విశ్వాసంతో ఉన్నారు. కాగా ఆమెరాజకీయ ప్రత్యర్థి బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ ఖలీదా జియా అవినీతి ఆరోపణలపై జైల్లో ఉన్నారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉదయం నుంచే ఎన్నికల కేంద్రాల వద్ద ఓటర్ల కోలాహలం మొదలైంది. కాగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనల్లో 12 మంది మరణించగా, అంతే సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. రంగామతి కావ్‌కాళీ వద్ద జరిగిన ఘటనల్లో అవామీలీగ్ యువజన విభాగం జూబోలీగ్ అధినేత మరణించగా, పది మంది గాయాలయ్యాయి. ఇక్కడ బీఎన్‌పీ కార్యకర్తలు జూబోలీగ్ కార్యకర్తలపై దాడికి దిగారు. ఈ సందర్భంగా కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చోటాగ్రామ్‌లో ఒక బీఎన్‌పీ కార్యకర్త ఘర్షణల్లో మరణించాడు. రాజాసాహి వద్ద ఘటనల్లో అవామీలీగ్ కార్యకర్త,నర్సింగ్డీ వద్ద జరిగిన గొడవల్లో మరో అవామీలీగ్ కార్యకర్త మరణించాడు.
నౌకౌలి వద్ద జరిగిన ఘర్షణల్లో ఒక పోలీసు అధికారి మరణించాడు. అనేక చోట్ల పోలింగ్ బూత్‌లను అవామీలీగ్ కార్యకర్తలు ఆక్రమించుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారని బీఎన్‌పీ ప్రతినిధి రాహుల్ కబీర్ రిజ్వీచెప్పారు. జాతీయ యూనిటీ ఫ్రంట్ నేత కమల్ హసన్ మాట్లాడుతూ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. కాగా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు బంగ్లాదేశ్ పోలీస్ చీఫ్ మహ్మద్ జావేద్ పట్వారీ చెప్పారు. అక్కడక్కడ కొన్ని స్వల్ప సంఘటనలు మినహా ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే ఘటనలేమీ జరగలేదన్నారు. దేశంలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆరు లక్షల మంది సైనికులు, పోలీసులను సమస్యాత్మక ప్రాంతాల్లో నియమించినట్లు చెప్పారు. పలు చోట్ల పోలీసులు ఓటర్లను బెదిరించినట్లు బీఎన్‌పీ ప్రతినిధి చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులు, మొబైల్ ఫోన్ల సర్వీసులను నిలిపివేశారు. ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేస్తూ దేశంలో 299 నియోజకవర్గాల్లో 1848 అభ్యర్థులు పోటీలో ఉన్నారని పేర్కొంది. 40,183 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశామన్నారు. కాగా దేశ వ్యాప్తంగా జమున టీవీ చానల్ ప్రసారాలు నిలిచిపోయాయి. తమ చానల్ ప్రసారాలను ప్రభుత్వం నిలిపివేసిందని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు.
చిత్రాలు.. ఢాకాలో భారీ భద్రత..
*ఆందోళన కారులు దగ్ధం చేసిన వాహనాలు

*నిరసన కారులను అరెస్టు చేస్తున్న పోలీసులు