అంతర్జాతీయం

గ్యాస్ పేలుడులో నలుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, డిసెంబర్ 31: రష్యాలోని ఒక నివాసిత భవనంలో కొత్త సంవత్సరం సంబరాల్లో మునిగి తేలుతున్న సమయంలో జరిగిన గ్యాస్ పేలుడు నలుగురి ప్రాణాలను హరించింది. ఈ సంఘటనలో దాదాపు 70 మంది ఆచూకీ లభ్యం కాలేదు. పారిశ్రామిక పట్టణమైన మాగ్నిటోగోర్స్క్‌కు 1700 కిలోమీటర్ల దూరంలోని యూరల్ కొండ ప్రాంతంలో గల తూర్పు మాస్కోలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం దాదాపు 6 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. గ్యాస్ పేలుడుతో భవనంలోని చాలా భాగం కుప్పకూలింది. ఈ సంఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా తీవ్రంగా గాయపడిన ఇద్దరు చిన్నారులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దాదాపు 70 మంది వరకు ఆచూకీ లభించలేదు. ఏడుగురు చిన్నారులు సహా 16 మందిని సంఘటన స్థలం నుంచి ఖాళీ చేయించారు. జాతీయ టెలివిజన్ కథనం ప్రకారం..దాదాపు 50 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. అయితే, ఎంతమంది అదృశ్యమైనదీ అధికారికరంగా వెల్లడికాలేదు. సంఘటన జరిగిన ప్రాంతంలో మైనస్ 18 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉండడంతో సహాయక చర్యలు చేపట్టడంలో కాస్త జాప్యం జరుగుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.