అంతర్జాతీయం

హసీనా ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, డిసెంబర్ 31: బంగ్లాదేశ్ జాతీయ ఎన్నికల్లో షేక్ హసీనా వరుసగా నాలుగోసారి ఘనవిజయం సాధించారు. అత్యంత వివాదాస్పదంగా మారిన ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్థి ఖలీయాజియాను భారీ మెజారిటీతో ఓడించిన హసీనా వరుసగా నాలుగోసారి కూడా అవామి లీగ్ పార్టీకి తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టారు. షేక్ హసీనా విజయంతో భారత్-బంగ్లా మధ్య సుహృద్భావ సంబంధాలకు మరింతగా అవకా శం ఏర్పడింది. అవామి లీగ్ సారథ్యంలోని కూటమి 300 స్థానాలు కలిగిన పార్లమెంట్‌లో 288 సీట్లను కైవసం చేసుకుంది. తీవ్రస్థాయి హింస, విధ్వంసకాండ నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో 82 శాతం ఓట్లను అధికార కూటమి దక్కించుకుంది. ఇంతకుముందు జరిగిన ఎన్నికల విజయాల కంటే కూడా తాజా ఎన్నికల్లో హసీనా పార్టీ మరింతగా తన బలాన్ని పెంచుకుంది. ప్రతిపక్ష జాతీయ ఐక్యతా ఫ్రంట్ 15 శాతం ఓట్లతో ఎనిమిది సీట్లను మాత్రమే దక్కించుకుంది ఎన్నికల కమిషన్ కార్యదర్శి హెలాలుద్దీన్ అహ్మద్ తెలిపారు. మరోమూడుస్థానాలను ఇతర పార్టీలు గెల్చుకున్నాయన్నారు. అభ్యర్థి మరణించిన కారణంగా ఒక నియోజకవర్గ ఫలితాన్ని వాయిదా వేసినట్టు తెలిపారు. అఖండ విజయం సాధించిన హసీనాను ప్రధాని మోదీ అభినందించారు. బంగ్లా అభివృద్ధిలో భారత్ పూర్తిగా సహకరిస్తుందని హామీనిచ్చారు. హసీ నా సారథ్యంలోని బంగ్లాతో భారత్ సంబంధా లు ఎంతగానో అభివృద్ధి చెందాయని తెలిపారు. గత కొన్ని సంవత్సరాల్లో భారత్,బంగ్లాలు ఎన్నో సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించుకోగలిగాయి. కాగా, తమ భూభాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత్ వ్యతిరేక కలాపాలకు అనుమతించబోమని స్పష్టం చేసిన హసీనా ప్రభుత్వం అందుకు సంబంధించి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజా విజయం నేపథ్యంలో మాట్లాడిన హసీనా తమ పార్టీ సాధించిన ఈ ఘన విజయం ప్రజావిజయమని అభివర్ణించారు. 1971లో జరిగిన బంగ్లాదేశ్ విజయంతో దీనిని పోల్చారు. అయితే ఇది తన వ్యక్తిగత విజయాలకు ఉద్దేశించినది కాదని, దేశాభివృద్ధి, ప్రజలకే దీనిని అంకితం చేస్తున్నానని అన్నారు. ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించిన ప్రత్యర్థి ఖలీదా జియా పార్టీ బీఎంపీకి తిరుగులేని దెబ్బ తగిలినట్టయ్యింది. అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఖలీదాజియా భవితవ్యం అగమ్యంగా మారింది. కాగా, ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలను ఎన్నికల కమిషన్ కొట్టివేసింది. మళ్లీ ఎన్నికలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.