అంతర్జాతీయం

కాల్పుల విరమణ ఉల్లంఘన దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జనవరి 1: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత సైనిక దళాలు నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు తెగబడి తమదేశానికి చెందిన ఒక మహిళ మరణానికి కారకులయ్యారని ఆరోపిస్తూ భారత డిప్యూటీ హై కమిషనర్‌కు పాకిస్తాన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సౌత్ ఆసియా, సార్క్ డైరెక్టర్ జనరల్, పాక్ విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ ఈ మేరకు భారతీయ దౌత్యాధికారులకు తమ నిరసన తెలుపుతూ డిసెంబర్ 31న భారత దళాలు ఆధీన రేఖ, సరిహద్దు వద్ద పాక్‌పౌరులను లక్ష్యంగా చేసుకుని నిరవధికంగా భారీ ఆయుధాలను ప్రయోగించారని ఆరోపించారు. దీంతో ఒక మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా భారత సైనికులు 2018లో 2350కు పైగా ఉల్లంఘనలకు పాల్పడి దాడులు చేయడంతో 36 మంది పౌరులు మృతి చెందగా, 142 మంది గాయపడ్డారని ఆయన ఒక ప్రపకటనలో ఆరోపించారు. 2017 నుంచి భారత్ ఎన్నో ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆయన తెలిపారు. పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడటం అంతర్జాతీయ మానవహక్కులను ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ఇరుదేశాల మధ్య అశాంతి, అస్థిర వాతావరణం ఏర్పడుతోందని అన్నారు. 2003లో కుదుర్చుకున్న కాల్పుల విరమణ అమరికను భారత్ ఇకనైనా గౌరవించాలని ఆయన హితవు పలికారు.