అంతర్జాతీయం

మాతృత్వం గొప్పది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాటికన్ సిటీ, జనవరి 1: మాతృత్వం గొప్పదని, ప్రపంచంలోని అన్ని రకాల అశాంతులను పారద్రోలే శక్తి తల్లి ప్రేమకు ఉందని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. మాతృత్వం, తల్లిప్రేమను కీర్తిస్తూ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చిలో ఆయన నూతన సంవత్సర వేడుకలను ప్రారంభించారు. ప్రేమలేక కలుషితమైన ప్రపంచంలో ప్రజలు తమ బాధను అధిగమించేందుకు దైవ శక్తికి మించిన మార్గం మరొకటి లేదన్నారు. ప్రపంచంలో ప్రతి బిడ్డను తల్లి నడిపిస్తుందన్నారు. ఆ శక్తితోనే భవిష్యత్తులోకి అడుగుపెట్టాలని ఆయన ఆకాంక్షించారు. ప్రేమ, సోదరభావంతో మెలగాలన్నారు. తల్లులను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నారు. హీరోయిజానికి తల్లి ప్రతీక అన్నారు. అనురాగం, అప్యాయత, కుటుంబ బంధాలను పెంచుకోవాలన్నారు.