అంతర్జాతీయం

తీరుమారకుంటే రూటు మారుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, జనవరి 1: అమెరికాతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని, తమ దేశంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయని పక్షంలో అణ్వస్త్ర పరీక్షలు, ప్రయోగాలపై తమ వైఖరి మారదని ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆయన సందేశం ఇస్తూ, గత ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌తో చర్చలు జరిపామని, కాని ఇంతవరకు ఆశించిన ప్రయోజనాలు కలగలేదన్నారు. ఈ చర్చల వల్ల ఎటువంటి ఫలితాలు సాధించలేదన్నారు. మా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకునేందుకు తమ దేశం సిద్ధంగా ఉందన్నారు. భద్రత విషయంలో రాజీలేదన్నారు. ఆయుధ శక్తిని పెంపొందించుకుంటామన్నారు. అమెరికా రానున్న రోజుల్లో తమ దేశం పట్ల ప్రదర్శించే వైఖరిని బట్టి భవిష్యత్తు ఉంటుందన్నారు. తమ దేశంపై ఇంతవరకు ఆంక్షల విషయమై ఉపశమనం ఇచ్చే విధంగా అమెరికా చర్యలు తీసుకోలేదన్నారు. కిమ్ తన ప్రసంగంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అమెరికాతో చర్చించిన అనేక అంశాల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. ఆంక్షల విషయంలో ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోకుండా, శాంతి సాధ్యం కాదని ఆయన చెప్పారు. కిమ్ తమదేశ సామ్యవాద ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలనే తాపత్రయంతో ఉన్నట్లు అమెరికా రక్షణ రంగ నిపుణఉలు అంకిత్ పండా చెప్పారు. ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించినా, వాటికి తగ్గట్టుగా నడుంచుకుంటుందనే నమ్మకం కలిగించాల్సి ఉంటుందన్నారు. గత ఏడాది సింగపూర్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ మధ్య చర్చలు జరిగిన విషయం విదితమే.