అంతర్జాతీయం

‘జెన్నీ’ రికార్డు అబద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జనవరి 2: ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకూ అత్యంత సుదీర్ఘ కాలం జీవించిన వ్యక్తి ఎవరని ప్రశ్నిస్తే, ఫ్రాన్స్‌కు చెందిన జెన్నీ కాల్మెట్ పేరును అందరూ పేర్కొంటారు. 1997లో జెన్నీ మృతి చెందినప్పుడు ఆమె వయసును 122 సంవత్సరాల 164 రోజులుగా అధికారులు నిర్ధారించారు. అంత ఎక్కువ కాలం అప్పటి వరకూ ఎవరూ జీవించలేదని ద్రువీకరిస్తూ, రికార్డు పుస్తకాల్లో ఆమె పేరును నమోదు చేయించారు. కానీ, రష్యా గణితశాస్తవ్రేత్త నికొలయ్ జాక్ మాత్రం ఈ రికార్డు తప్పని వాదిస్తున్నారు. అసలు జెన్నీ ఎప్పుడో మృతి చెందిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జెన్నీ కుమార్తే ఆమెలా పేరు మార్చుకుందని అతను జీవశాస్తవ్రేత్త వాలెరీ నొవొసెలోవ్‌తో కలిసి సాగించిన పరిశోధనలో తేల్చిచెప్పారు.
జెన్నీవిగా చెప్పబడుతున్న ఫొటోలు, ధ్రువ పత్రాలు, సాక్ష్యాలను క్షుణంగా పరిశీలించిన మీదట, జెన్నీ కమార్తె వోనే్న జాక్ తన తల్లి పేరుమీద చెలామణి అయిందని జాక్ తన నివేదికలో స్పష్టం చేశారు. దీర్ఘాయుష్షుపై విస్తృత పరిశోధన చేసిన జాక్ పలు అంశాలను పరిశీలించినట్టు చెప్పారు. 1943లో జెన్నీ కుమార్తె వోనే్న మృతి చెందినట్టు నమోదైన పత్రాలను కూడా పరిశోధించినట్టు పేర్కొన్నారు. అన్ని సాక్ష్యాధారాలను పోల్చిచూస్తే, నిజానికి అప్పట్లో చనిపోయిందని జెన్నీ కుమార్తె వోనే్న కానేకాదని తేలిందని ఒక ప్రకటనలో జాక్ తెలిపారు. నిజానికి అప్పుడు జెన్నీ మృతి చెందిందని, అయితే, పన్నుల చెల్లింపు నుంచి తప్పించుకోవడానికి వోన్నీ తన తల్లి పేరును తానే తీసేసుకుందనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయన్నారు. జెన్నీ మృతి చెందితే, ఆ సమాచారాన్ని దాచేసిన వోనే్న తానే ఆమె గుర్తింపు పత్రాలను తీసేసుకుందని తెలిపారు. ఆతర్వాత వోనే్ననే జెన్నీగా చెలామణి అయిందన్నారు. ఆమె 1997లో తన 99వ ఏట మృతి చెందినట్టు పేర్కొన్నారు. జెన్నీ రికార్డు తప్పని, ఆమె అంతకు ముందే మృతి చెందిందని, ఆమె పేరుతో బతికిన వోనే్న వంద సంవత్సరాలు కూడా బతలేకదని రుజువైనట్టు చెప్పాడు. కాబట్టి జెన్నీ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును తొలగించాలని కోరాడు.
*ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు నెలకొల్పిన జెన్నీ ఫైల్ ఫొటో.
అయితే, ఇది జెన్నీ ఫొటో కాదని, ఆమె కుమార్తె వోనే్నది అనీ రష్యా గణితశాస్తవ్రేత్త ఆరోపిస్తున్నారు