అంతర్జాతీయం

మీకు దేశ భద్రత పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 2: ప్రభుత్వం మూతపడిపోతుదంటూ ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ చేస్తున్న ప్రకటనలను వైట్‌హౌస్ కొట్టిపారేసింది. అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి ముందు చూపుకొరడవడడం వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తుతోందని విపక్షం సంచలన ప్రకటన చేసింది. వైట్‌హౌస్ వర్గాలు బుధవారం ఈ ప్రకటనలను పసలేనివిగా కొట్టిపారేసింది. డిసెంబర్ 22న పాలనా వ్యవస్థ పాక్షికంగా మూతపడడం మొదలైంది. ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడింది. దీని వల్ల అనేక మంది పనిలేకుండా పోవడమో లేదా వేతనాలు కోల్పోవడమో జరుగుతుంది. ప్రభుత్వ వ్యవస్థ మూతపడుతుందేమోనన్న అనుమాలకు బలం చేకూరేలా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ క్రిస్మస్, న్యూఇయర్ పర్యటన రద్దయింది. కుటుంబ సభ్యులతో కలిసి ట్రంప్ ఫ్లోరిడాలోని మారా లాగో రిసార్ట్‌కు టూర్ ఖరారు అయింది. అయితే కొన్ని కారణాల వల్ల అధ్యక్షుడు పర్యటన రద్దుచేసుకోవల్సి వచ్చింది. గడ ఏడాది సెప్టెంబర్ 30న తలెత్తిన సంక్షోభం పునరావృతమవుతోందని ప్రతిపక్ష డెమోక్రాట్లు స్పష్టం చేస్తున్నారు. గురువారం ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఇదే అంశంపై విపక్షం గొంతెత్తనుంది. దీనికి తోడు సరిహద్దు గోడ, భద్రతపై ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటోంది. పరిస్థితి తీవ్రతను గమనించిన అధ్యక్షుడు ట్రంప్ బుధవారం డెమోక్రాట్లు, రిపబ్లికన్‌లను అఖిలపక్ష సమావేశానికి పిలిచారు. దేశ భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి అలక్ష్యం ప్రదర్శించబోదని వైట్‌హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. అమెరికన్ల భద్రతకు, దేశ సరిహద్దులను పరిరక్షించేందుకు ట్రంప్ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి శారా సాండర్స్ ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే ప్రతిపక్ష డెమోక్రాట్లపై ఆమె విరుచుకుపడ్డారు. పరిస్థితి తీవ్రతను గుర్తించి అధ్యక్షుడే స్వయంగా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.