అంతర్జాతీయం

దేశ రక్షణలో రాజీలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 5: మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టేందుకు నిధులను మంజూరు చేయకపోతే జాతీయ స్థాయిలో అత్యవసరపరిస్థితిని విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్చరించారు. సరిహద్దుల్లో చొరబాటుదారులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించాల్సిందేనని, ఇందులో రాజీలేదని ఆయన పేర్కొన్నారు. ఈ గోడ నిర్మాణానికి రూ.5.6 బిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. ఈ నిధుల మంజూరుకు అమెరికా కాంగ్రెస్ అనుమతి కావాల్సి ఉంటుంది. కాని డెమాక్రట్లు మాత్రమే ఈ ప్రతిపాదనకు ససేమిరా అంటున్నారు. కాంగ్రెస్ అనుమతిలేకుండా జాతీయ అత్యవసరపరిస్థితిని విధించి గోడ కట్టేస్తానన్నారు. ఈ వివరాలను ఆయన ఇక్కడ శే్వతసౌధంలో విలేఖర్లకు చెప్పారు. ట్రంప్ శే్వతసౌధంలో డెమాక్రట్లతో సమావేశమై ఈ వివరాలను చర్చించారు. ఈ సమావేశం సంతృప్తినిచ్చిందని ట్రంప్ చెప్పారు. ఒక వేళ డెమాక్రట్లు సహకరించకపోతే, కాంగ్రెస్ అనుమతిరాకపోతే తప్పనిసరిగా ఎమర్జన్సీ పెట్టి గోడ కట్టేస్తానన్నారు. ఈ గోడను వీలైనంత త్వరలో నిర్మిస్తానన్నారు. అంతకుముందు సెనెట్‌లో మైనార్టీ పార్టీల న నేత చుక్ షేముర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింపచేయరాదన్నారు. ఈ సమావేశానికి హాజరైన స్పీకర్ నాన్సీ పెలోసీ మాట్లాడుతూ ప్రభుత్వపై ప్రతికూల ప్రభావం పడే విధంగా జాతీయ ఎమర్జన్సీని విధించరాదన్నారు. దీని వల్ల ప్రజలకు మేలు జరగదన్నారు. ట్రంప్ దీనిపై మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవస్థలను మూసివేసి ఎమర్జన్సీని విధించాలన్న సంకల్పం తనకేమీ లేదని, దేశభద్రత విషయంలో మాత్రం రాజీపడనని పేర్కొన్నారు.