అంతర్జాతీయం

అఫ్గాన్‌లో కూలిన గని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుందుజ్, జనవరి 6: అఫ్గానిస్తాన్‌లో ఒక బంగారు గని కూలిపోవడంతో దాదాపు 30 మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడులతో అతలాకుతలం అవుతున్న అఫ్గాన్‌లో ఇది మరో విషాదకర సంఘటనగా అధికారులు అభివర్ణిచారు. ఈశాన్య అఫ్గాన్ కోహిస్తాన్ జిల్లా బదక్షాన్ ప్రావిన్స్ గవర్నర్ మొహమ్మద్ రుస్తాం రాగి వివరాల మేరకు- స్థానిక నదీ పరీవాహక ప్రాంతంలో బంగారంకోసం గాలించేందుకు 200 అడుగుల గోతిని తవ్వి అందులోకి గ్రామస్థులు దిగారు. అకస్మాత్తుగా గోయి పూడుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో 30 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వివరించారు. అయితే మరణించినవారిలో పిల్లలు ఎవరూ లేరని గవర్నర్ ప్రతినిధి నిక్ మొహమ్మద్ నజారి తెలిపారు. తరతరాలుగా ఇక్కడి ప్రజలకు ఇదే వృత్తి. ఇక్కడ బంగారం కోసం అనే్వషిస్తుంటారని ఆయన వివరించారు. పర్వతాలతో నిండి ఈ ప్రాంతం చాలా వెనుకబడి వుంటుంది. తజకిస్తాన్, చైనా, పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో శీతాకాలంలో విపరీతమైన మంచు కూడా కురుస్తుంటుంది. అక్రమ తవ్వకాలు ఇక్కడ మామూలేనని ఆయన చెప్పారు.