అంతర్జాతీయం

స్టీల్ కంచెకు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 7: సరిహద్దు వద్ద కాంక్రీట్ గోడను నిర్మించి తీరాలని ఇంతకాలం పట్టుబడుతూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెట్టు దిగారు. మెక్సికోసరిహద్దులో కాంక్రీట్ గోడకు బదులుగా స్టీల్ కంచెను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. సరిహద్దులో గోడ నిర్మాణానికి నిధులు విడుదల చేసేందుకు డెమోక్రాట్లు అంగీకరిస్తేనే ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదిస్తామని ట్రంప్ ప్రకటించడం, దానికి డెమోక్రాట్లు నో అనడంతో దేశంలో పాక్షిక షట్‌డౌన్ కొనసాగుతోంది. గోడ నిర్మాణానికి అంగీకరించాలని, లేకపోతే పాక్షిక షట్‌డౌన్ కొనసాగుతుందని భీష్మించిన ట్రంప్ గోడ కాకపోయినా ఉక్కు కంచెనైనా ఏర్పాటు చేయాలని కోరారు. అమెరికా-మెక్సికో సరిహద్దు వద్ద గోడ నిర్మాణానికి ఐదు వేల యూఎస్ డాలర్ల నిధులు ఇవ్వడానికి డెమోక్రాట్లు అంగీకారం తెలపకపోవడంతో గత ఏడాది డిసెంబర్ 22 నుంచి అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ కొనసాగుతోంది. సరిహద్దు భద్రతకు సంబంధించి 1.3 మిలియన్ డాలర్లు మాత్రమే విడుదల చేయాలని సభలో మెజారిటీ సభ్యులున్న డెమోట్రాట్లు పట్టుబడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ ప్రెసిడెంట్ మైక్ పీన్స్, స్పీకర్ నాన్సి పిలోసి, సెనేట్ మైనారిటీ నేత చుక్ స్కమ్మర్‌తో ట్రంప్ ఆదివారం చర్చలు జరిపిన అనంతరం మాట్లాడుతూ తమ చర్చలు ఫలప్రదంగా ముగిసాయని చెప్పారు. మెక్సికో సరిహద్దులో కాంక్రీటు గోడ స్థానంలో ఉక్కు కంచెను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, ఇది పటిష్టంగా ఉండటమే కాక అక్రమ వలసదారులను నిరోధిస్తుందని అన్నారు. షట్‌డౌన్ మూడోవారంలోకి ప్రవేశించినందున డెమోక్రాట్లతో జరిపిన నిర్మాణాత్మకమైన సమావేశంలో పలు అంశాలను చర్చించామని, త్వరలోనే దీనిని ఎత్తివేస్తామని అన్నారు. సరిహద్దు భద్రత, అక్కడ ఏర్పాట్లు తదితర అంశాలు చర్చకు రాగా, సరిహద్దులో ఉక్కు కంచె ఏర్పాటు చేయాలని తాను ప్రతిపాదించానన్నారు. సరిహద్దులో గోడను నిర్మించడాన్ని డెమోక్రాట్లు వ్యతిరేకిస్తున్నందున తాను ఈ అంశాన్ని వారికి వివరించినట్టు ట్రంప్ తెలిపారు. అమెరికాలో షట్‌డౌన్ ఈనెల 12తో 22వ రోజుకు చేరుకుంటుందని, ఇది కొత్త రికార్డని, గతంలో క్లింటన్ హయాంలో 21 రోజులు కొనసాగిందని, ప్రస్తుతం పాక్షిక షట్‌డౌన్ కారణంగా దేశంలోని 8 లక్షల మంది ఉద్యోగులు పనికి హాజరు కాకపోవడం లేదా వేతనం లేకుండా పనిచేయడమో చేయాల్సి వస్తోందని ట్రంప్ తెలిపారు.