అంతర్జాతీయం

విద్వేషంతో విపత్తే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైరోబీ, జూలై 11: విద్వేషం, హింసాత్మక ధోరణులను రెచ్చగొట్టే వారి వల్లే సమత, సామరస్యమే పునాదిగా ఉన్న సమాజాలకు తీవ్ర విఘాతం కలుగుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రవాదానికి హద్దులు, సరిహద్దులు లేవని, దానికి ఓ మతం,కులం, విలువ అంతకంటే లేదని నిప్పులు చెరిగారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ తన ఉద్వేష సిద్ధాంతాలను ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నైరోబీ విశ్వవిద్యాలయంలో సోమవారం మాట్లాడిన మోదీ ఉగ్రవాద సిద్ధాంతాలను, విద్వేష పూరిత ప్రసంగాల విధ్వంసక లక్షణాలను ఎండగట్టారు. ఉగ్రవాద సిద్ధాంతాలను తిప్పికొట్టే విధంగా యువత ప్రబల శక్తిని సంతరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేవారిని, వారిని రాజకీయ పావులుగా ఉపయోగించుకుంటున్న వారినీ వదిలి పెట్టడానికి వీల్లేదంటూ పాకిస్తాన్‌పై పరోక్షంగా ధ్వజమెత్తారు. ఉగ్రవాదానికి ఏ రూపంలో మద్దతు పలికినా అలాంటి వారి చర్యలనూ తీవ్ర స్థాయిలో గర్హించాల్సిందేనన్నారు. ఉగ్రవాదం, విద్వేషాలకు తావులేని సమాజ నిర్మాణమే ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలని ఉద్ఘాటించారు. ఆర్థిక ప్రగతి ప్రయోజనాలు అనుకున్న ఫలితాలను అందించాలంటే ప్రజా క్షేమం, సామాజిక భద్రత అత్యంత కీలకమని మోదీ ఉద్బోధించారు. తీవ్రవాద, అతివాద ధోరణులను తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్న మోదీ ఈ విషయంలో విద్యార్థులు కీలక భూమిక పోషించాలని ఉగ్రవాద సిద్ధాంతాలకు ప్రతిగా బలమైన సానుకూల ఆలోచనా సరళిని శక్తివంతం చేయాలని కోరారు. యువతనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థ ఐసిస్ తన కోరలను విస్తరిస్తున్న నేపథ్యంలో యువత చైతన్య వంతం కావాలని, ఉగ్రవాద భావజాలాన్ని తరిమికొట్టే విధంగా చైతన్యపూరితంగా ముందుకు సాగాలని మోదీ పిలుపునిచ్చారు. విద్యావంతులైన యువకులు బంగ్లాదేశ్‌లో ఇటీవల ఓ కేఫ్‌పై దాడి చేసి 22మంది విదేశీయుల్ని హతమార్చడం, ఆ యువకుల్లో ఒకరు వివాదాస్పద భారత ముస్లిం జకీర్ మాలిక్ ప్రసంగాలకు ప్రభావితమైన నేపథ్యంలో మోదీ ఈ ఉద్బోధన చేశారు. ఆర్థిక లక్ష్యాల సాధన దిశగా బలమైన అడుగులు వేయాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్న మోదీ ఇందుకు ప్రజా సంక్షేమం, భద్రతే కీలకంగా పనిచేయాలన్నారు.

చిత్రం.. కెన్యాలోని నైరోబి యూనివర్శిటీ సందర్శనకు గుర్తుగా మొక్క నాటుతున్న ప్రధాని మోదీ