అంతర్జాతీయం

డెమొక్రాట్లతో చర్చలు విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 10: మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రతిపాదన రోజు రోజుకు ముదురుతోంది. ఈ అంశంపై డెమాక్రట్లతో ట్రంప్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల మధ్యలో నుంచి ట్రంప్ ఆవేశంతో నిష్క్రమించారు. ఎటువంటి పరిస్థితుల్లో 5.7 బిలియన్ డాలర్ల ఖర్చయ్యే గోడ నిర్మాణానికి అంగీకరించేది లేదని డెమాక్రట్లు భీష్మించుకుని కూర్చున్నారు. చర్చల మధ్యలో బల్లపై గట్టిగా చరుస్తూ ట్రంప్ సమావేశం నుంచి వెళ్లిపోవడంపై హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ, సెనెట్ మైనార్టీ నేత చుక్ షూమర్ విస్మయం వ్యక్తం చేశారు. మెక్సికో నుంచి అక్రమంగా శరణార్థులు దేశంలోకి చొరబడడం, మాదకద్రవ్యాల అక్రమరవాణాను అరికట్టాలంటే గోడ నిర్మాణం అనివార్యమని ట్రంప్ స్పష్టం చేశారు. గోడ నిర్మాణం ఎన్నికల హామీ కావడంతో ట్రంప్ ఈ ప్రతిపాదన నుంచి వెనక్కు తగ్గేందుకు ససేమిరా అంటున్నారు. డెమాక్రట్లు మాత్రం గోడ వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదని, దండగమారి పని అని అంటున్నారు. మెక్సికో కూడా గోడ నిర్మాణానికి తమ దేశం ఎందుకు డబ్బును ఖర్చుపెడుతుందని అడ్డం తిరిగింది. ఈ వివాదం ఒక కొలిక్కిరాకపోవడంతో ఫెడరల్ ప్రభుత్వంలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ ప్రతిష్టంభన గత నెల 22వ తేదీ నుంచి కొనసాగుతోంది. 19 రోజులుగా ఉద్యోగులు విధులకు హాజరు కావడం లేదు. 1995-96లో ఉద్యోగులు 21 రోజులు విధులకు హాజరు కాలేదు. రిపబ్లికన్లు, డెమాక్రట్ల మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో, రానున్న రోజుల్లో సంక్షోభం తీవ్రం కానుంది. 30 అడగుల ఎత్తున కాంక్రీట్ గోడ బదులు స్టీల్ ఫెన్సింగ్‌కు మొగ్గు చూపారన్న వార్తలు వచ్చాయి. కాని గోడ తప్ప మరే ప్రతిపాదనకు అంగీకరించేది లేదని ట్రంప్ కరాఖండిగా ప్రకటించారు.