అంతర్జాతీయం

సింగపూర్‌లో భారతీయుడికి 13 ఏళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్: ఒక మైనర్ బాలికను ప్రలోభాలకు గురి చేసి లైంగిక వాంఛలను తీర్చుకునే ప్రయత్నం చేసిన ఒక భారతీయుడికి సింగపూర్ కోర్టు 13 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది. సింగపూర్ హైకోర్టు జ్యుడీషియల్ కమిషనర్ పాంగ్ కాంగ్ చౌ ఈ తీర్పు ఇచ్చారు. భారత సంతతికి చెందిన ఉదయ్‌కుమార్ దక్షిణామూర్తి ఈ కేసులో నిందితుడని పోలీసులు చెప్పారు. 13 ఏళ్ల బాలికను లోబరుచుకునేందుకు రకరకాల ప్రయత్నం చేయడమే కాకుండా, నగ్నంగా ఉన్న ఫోటోలు కూడా తీశారని పోలీసులు చెప్పారు. అభం శుభం ఎరుగని ఆ పాపను పెళ్లి చేసుకుంటానని, తాను భర్తనని, ఆ పాప భార్యని కూడా చెప్పాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 2016 నుంచి దక్షిణామూర్తి ఈ ఆకృత్యాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రాసిక్యూషన్ అన్ని అభియోగాలను నిరూపించిందని న్యాయాధికారి తీర్పులో పేర్కొన్నారు. మైనర్ బాలిక వద్ద ఉన్న ఫోన్‌లో ఆ పాప నగ్నంగా ఉన్న ఫోటోను దక్షిణామూర్తి వల్ల గర్భం దాల్చిన ఒక యువతి చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తీగలాగితే డొంకంతా కదిలినట్లు దక్షిణామూర్తి వ్యవహారం బయటపడింది. మైనర్ బాలికను సెక్స్‌లో పాల్గొనాలని బలవంతం చేసేవాడని, ఆ పాపను బయటకు తీసుకెళ్లినప్పుడల్లా సింగపూర్ డాలర్లు ఇచ్చేవాడని ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. పాపకు ఐస్‌క్రీంలు, ఆటవస్తువులు కొని ఇచ్చేవాడని కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగి కేసునమోదు చేసి దర్యాప్తు చేశారు. చివరకు అభియోగాలు రుజువు కావడంతో సింగపూర్ కోర్టు నిందితుడు దక్షిణామూర్తికి 13 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది.