అంతర్జాతీయం

హెచ్-1బీ వీసా ఉంటే పౌరసత్వం ఇచ్చేందుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 12: హెచ్-1బీ వీసాలో సంస్కరణలు తేనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించారు. కొత్త విధానం వల్ల అమెరికాలో ఈ వీసాపై ఉన్న ఐటీ నిపుణులు, ఇతర రంగాల నిపుణులకు దశలవారీగా త్వరితగతిన పౌరసత్వం లభిస్తుందని భరోసా ఇచ్చారు. హెచ్-1బీ వీసాలో బృహత్తర మార్పులు తెచ్చేందుకు సమగ్ర విధానాన్ని తెస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశార. దీని వల్ల ప్రతిభావంతులైన వారు ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసించేందుకు, నైపుణ్యం పెంచుకునేందుకు వీలవుతుందన్నారు. కొత్త విధానాలు సరళంగా ఉంటాయన్నారు. ఇక్కడే స్థిరపడేందుకు తగిన వాతావరణం కల్పిస్తామన్నారు. దీంతో ఐటి రంగంలో ఇక్కడ వీసాపై ఉన్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ మొదటిసారిగా చాలా సానుకూలంగా హెచ్-1బీ వీసాపై ప్రకటన చేయడం శుభవార్తగా భావిస్తున్నామని ఈ వీసా ఉన్న వారు చెప్పారు. ఈ వీసాపై ఇక్కడ ఉంటూ కాలపరిమితి ముగిసేందుకు చేరువగా ఉన్న వారికి వీసాను పొడిగిస్తామన్నారు. వీరికి కొత్త వీసా ఇస్తామన్నారు. భారతీయ ఐటీ నిపుణులు అధిక సంఖ్యలో హెచ్-1బీ వీసాపై అమెరికాలో ఉంటున్నారు. ఈ ట్వీట్‌లో ఇంతకంటే వివరాలు లేకపోవడం గమనార్హం.