అంతర్జాతీయం

పేలిన పెట్రోల్ ట్యాంకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్రి (నైజీరియా), జనవరి 12: రోడ్డుపై పెట్రోల్ ట్యాంకర్ పేలిన ఘటనలో 18 మంది మరణించగా, ఎంతోమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన దేశ రాజధాని కాల్‌బార్‌కు శుక్రవారం సాయంత్రం జరిగింది. క్రాస్ రివర్ ప్రాంతంలోని ఒడుక్‌పానీలో పెట్రోల్ వాహనం బోల్తా పడిందని నైజీరియన్ పోలీసులు తెలిపారు. అయితే, పెట్రోల్ ట్యాంకర్ నుంచి కారుతున్న పెట్రోల్‌ను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ట్యాంకర్ పేలడంతో పలువురు వ్యక్తులు ఆ మంటల్లో మాడిమసి అయ్యారని వారు తెలిపారు. ఈ సంఘటనలో ఎంతమంది మృతి చెందినది ఇంతవరకు తెలియలేదని పేర్కొన్నారు. ట్యాంకర్ పేలిన దుర్ఘటనలో కనీసం 18 మంది చనిపోయి ఉంటారని, వీరిలో ఒక మహిళ కూడా ఉందని స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి తెలిపాడు. కాగా, ఈ సంఘటనలో గాయపడినవారిలో పెద్దలతోపాటు పలువురు పిల్లలు కూడా ఉన్నారు. వీదందరి బంధువులతో కాల్‌బార్ టీచింగ్ హాస్పిటల్ కిక్కిరిసింది.