అంతర్జాతీయం
బ్రిటిష్ ప్రధానిగా ధెరీసాకు మార్గం సుగమం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 12 July 2016
లండన్, జూలై 11: మార్గరెట్ థాచర్ తర్వాత బ్రిటిష్ మహిళా ప్రధానిగా ధెరీసామే పదవీ బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. ఇప్పటివరకూ ఈ పదవికి పోటీపడ్డ కన్సర్వేటివ్ పార్టీ నాయకురాలు ఆండ్రియా లీడ్సమ్ అనూహ్య రీతిలో తప్పుకోవడంతో దేశ ప్రధానిగా ధెరీసా ఎన్నికకు అవరోధాలు తొలగిపోయాయి. బుధవారం నాటికి దేశానికి కొత్త ప్రధాని వస్తారంటూ ప్రస్తుత ప్రధాని డేవిడ్ కామెరాన్ వెల్లడించారు. మంగళవారం చివరి కేబినెట్ సమావేశానికి తాను అధ్యక్షత వహిస్తానని, బుధవారం చివరి సారిగా కామన్స్ సభకు హాజరైన అనంతరం ఎలిజిబెట్ రాణిని కలుసుకుని అధికారికంగా రాజీనామా అందజేస్తానని విలేఖరుల సమావేశంలో తెలిపారు.