అంతర్జాతీయం

కాదంటే ‘కలకలమే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జనవరి 13: బ్రెగ్జిట్‌పై బ్రిటన్ నిర్ణయమేమిటి? ప్రధాని ధెరీసా ప్రతిపాదనలకు పార్లమెంట్ అనుకూలంగా స్పందిస్తుందా? లేక ప్రతికూల ఎంపీలే పట్టు నెగ్గించుకుంటారా? మంగళవారం జరుగనున్న ఓటింగ్ సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ప్యాకేజీని వ్యతిరేకించినట్టయితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని థెరీసామే ఎంపీలను హెచ్చరించారు. పదిహేను నెలల చర్చల అనంతరం బ్రెగ్జిట్‌పై కీలక ఓటింగ్ జరుగనున్న దృష్ట్యా థెరీసా తీవ్ర స్వరంతో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బ్రెగ్జిట్‌ను ఆమోదించక పోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో విశ్వసనీయతకు విలువ లేకుండా చేయడమే అవుతుందని కూడా ఆమె అన్నారు. అనుకూల, ప్రతికూల వాదనల మాట ఎలా ఉన్నా దేశ క్షేమాన్ని, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఎంపీలు వ్యవహరించాలని, బ్రెగ్జిట్ నమ్మకాన్ని వమ్ము చేయవద్దని కోరారు. గతాన్ని మర్చిపోయి ఎంపీలందరూ సానుకూలంగానే ఓటేయాలని సండే ఎక్స్‌ప్రెస్‌లో రాసిన వ్యాసంలో ఆమె కోరారు. మార్చి 29 నాటికల్లా ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాల్సి ఉన్నప్పటికీ ఇందుకు సంబంధించిన అంశాలపై ఇప్పటికీ స్పష్టత చేకూరలేదు. గతంలో కూడా ఎంపీల వ్యతిరేకత కారణంగా తాను ఎక్కడ ఓటమిపాలు అవుతానేమోనన్న భయంతో సెనేట్ ఓటింగ్‌ను థెరీసా వాయిదా వేశారు. అయితే మంగళవారం జరిగే ఓటింగ్‌లోనూ ఇదే పరిస్థితిని ధెరీసాకు తలెత్తవచ్చునని, ఆమె ప్రతిపాదనల పట్ల వ్యితిరేకత మరింత పెరిగిందని చెబుతున్నారు.