అంతర్జాతీయం

చర్చలే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జనవరి 19: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను అర్థవంతమైన ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్, పాకిస్తాన్‌లకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గట్టరస్ విజ్ఞప్తి చేశారు. ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాల సాధనకు అవసరమైన రీతిలో సహకరించేందుకు ఐరాస సిద్ధంగా ఉందని కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ రెండు దేశాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ అవి అనుకున్న ఫలితాలను సాధించలేదని ఈ నేపథ్యంలో ఉభయ దేశాల నేతలు సుహృద్భావ రీతిలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్ర వాదానికి పాకిస్తాన్ స్వస్తి పలకాలని అంతవరకు తాము ఎలాంటి శాంతి చర్చలను జరిపే ప్రసక్తిలేదని భారత్ ఇప్పటికే తెగేసి చెబుతున్న విషయం తెలిసిందే. ఓ పక్క ఉగ్రవాదం, మరో పక్క శాంతి చర్చలు ఎంత మాత్రం పొసగవని పలుమార్లు భారత్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మాట్లాడిన ఐరాస జనరల్ సెక్రటరీ ‘‘్భరత్, పాకిస్తాన్‌ల మధ్య శాంతి చర్చలు జరగడమన్నది అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశం. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు దేశాలు ఫలితాలు సాధించే విధంగా చర్చల ప్రక్రియను చేపట్టాలి’’ అని తెలిపారు. 2016లో జరిగిన పాక్ ఉగ్రవాద దాడి అనంతరం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సర్జికల్ దాడులు జరిపిన తర్వాత ఈ రెండు దేశాల మధ్య ఇప్పటి వరకు ద్వైపాక్షిక చర్చలు అన్నవే జరగలేదు.