అంతర్జాతీయం

డ్రీమర్లకు పౌరసత్వంపై భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 20: మెక్సికో సరిహద్దు గోడ నిర్మించేందుకు కొత్త ప్రతిపాదనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ముందుకు వచ్చారు. ఈ ప్రతిపాదన ప్రకారం దేశంలో సరైన డాక్యుమెంట్లు ఉద్యోగాలు చేస్తున్న ఏడు లక్షల మందికి సరైన రక్షణ చర్యలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాని ఈ ప్రతిపాదనను డెమాక్రట్లు తిప్పిగొట్టారు. 5.7 బిలియన్ డాలర్ల విలువ చేసే గోడ నిర్మాణానికి ఒప్పుకోమని వారు తెగేసి చెప్పారు. దీంతో గోడ వివాదంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. అమెరికాకు వెళ్లి ఆనందంగా జీవించాలన్న లక్ష్యంతో అక్రమంగా చొరబడి వచ్చి స్థిరపడిన వారిని డ్రీమర్స్ అంటారు. వీరికి పని చేసేందుకు రక్షణ ఉంటుంది. కాని పౌరసత్వం ఉండదు. వీరిని దేశం నుంచి ఉద్వాసన పలకకుండా ఇక్కడే ఉండేందుకు తగిన చట్టపరమైన భరోసా కల్పిస్తామిన ట్రంప్ హామీ ఇచ్చారు. అలాగే 805 మిలియన్ డాలర్లను ఖర్చుపెట్టి మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వారిని ఆ వ్యసనం నుంచి విముక్తి చేస్తామన్నారు. త్వరలో తాను ఇమ్మిగ్రేషన్ విధానంలో సంస్కరణలు తెస్తానన్నారు. కాని ట్రంప్ ప్రతిపాదనలను హౌస్ ఆఫ్ రిప్రంజెంటేటీవ్స్ స్పీకర్ నాన్సీ పెల్సీ తిరస్కరించారు. ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రతిష్టంభన 29వ రోజుకు చేరుకుంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు వీలైనంత త్వరలో చర్యలు తీసుకోవాలని వివిధ వర్గాల నిపుణులు కోరుతున్నారు.