అంతర్జాతీయం

ట్రంప్‌వన్నీ విజయాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 21: అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన రెండేళ్ల కాలంలో డొనాల్డ్ ట్రంప్ చారిత్రక ఫలితాలు సాధించారని వైట్‌హౌస్ ప్రకటించింది. జనవరి 20 నాటికి ట్రంప్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన సాధించిన విజయాలను వివరించింది. అమెరికాను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లారని 50లక్షల కొత్త ఉద్యోగాలను కల్పించడంతో పాటు, చైనా అనుసరిస్తున్న అసంబద్ధ వాణిజ్య విధానాలను కూడా ట్రంప్ ఎండగట్టారని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ట్రంప్ విజయాల మాట ఎలా వున్నా, దేశీయంగా రాజకీయ విభేదాలు గతంలో ఎన్నడూ లేనంతగా ఈ రెండేళ్ల కాలంలో తీవ్రమైన విషయం గమనార్హం. గత నెల రోజులుగా అధికార రిపబ్లికన్‌లు ప్రతిపక్ష డెమోక్రాట్ల మధ్య మెక్సికో గోడ నిర్మాణానికి సంబంధించిన తలెత్తిన రాజకీయ సంక్షోభం అమెరికా ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈ వివాదాల జోలికి పోని వైట్‌హౌస్ కేవలం ట్రంప్ సాధించిన విజయాల పైనే దృష్టి పెట్టింది. ఏ విధంగా చూసినా ట్రంప్ రెండేళ్ల పదవీ కాలం అమెరికాకు ఎన్నో విజయాలను ఆర్జించి పెట్టింది. ప్రపంచ స్థాయిలో అమెరికా నాయకత్వాన్ని బలోపేతం చేసిన ట్రంప్ సైనిక పరంగా కూడా దేశాన్ని శక్తివంతంగా మార్చారని వైట్‌హౌస్ తెలిపింది. వృద్ధి అనుకూల విధానాల ద్వారా అమెరికా ఆర్థిక ప్రగతికి ట్రంప్ బలమైన బాటలు వేశారని, ఉపాధి అవకాశాలను ముమ్మరం చేశారని తెలిపింది.