అంతర్జాతీయం

‘ఈవీఎం’లపై విచారణ జరిపించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జనవరి 22: ఈవీఎంలను హ్యాకింగ్ చేసి 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని లండన్‌లో భారత సైబర్ నిపుణుడు చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, ప్రజాస్వామ్య మనుగడకు భంగం కలిగించేవిగా ఉన్నాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ మంగళవారం డిమాండ్ చేశారు.
లండన్‌లో సైబర్ నిపుణుడు షుజా స్క్పైప్ ద్వారా జరిపిన విలేఖరుల సమావేశానికి తాను హాజరవ్వడాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించడం తగదని సిబాల్ అన్నారు. ఇది స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల గురించిన అంశం కాదని, ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయా లేదా అన్నది ఇక్కడ ప్రధాన అంశం అని ఆయన పేర్కొన్నారు. భారతదేశ ఎన్నికల వ్యవస్థపై షుజా తీవ్ర ఆరోపణలు చేశారని, దానిపై కచ్చితంగా విచారణ జరపాల్సిందేనని, అది సుప్రీం కోర్టు ద్వారా జరిపిస్తారా, ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారా అన్నది ప్రభుత్వ ఇష్టమని అన్నారు. ఈ తీవ్ర ఆరోపణలపై విచారణ జరపాలని, అవి అసత్యమని నిరూపితమైతే షుజా మీద చర్యలు తీసుకోవాలని, ఒకవేళ నిజమని నిర్ధారణ అయితే అది చాలా తీవ్ర విషయమని, ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ప్రమాదమని ఆయన చెప్పారు.
లండన్‌లో జరిగిన షుజా సమావేశానికి తాను హాజరు కావడంపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారని, ఆ సమావేశం కేంద్ర ఎన్నికల కమిషన్‌ను, భారత ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రేరేపించిన కుట్ర అని ఆయన విమర్శించడాన్ని కపిల్ తప్పుబట్టారు.
ఆ సమావేశాన్ని నిర్వహించిన జర్నలిస్టు ఆశిష్ రే తనకు వ్యక్తిగతంగా ఆహ్వానం పంపినందునే తాను ఆ సమవేశానికి హాజరైనట్టు కపిల్ స్పష్టం చేశారు. తనకు వేరే కార్యక్రమం ఉందని చెప్పినా తప్పకుండా సమావేశానికి రావాలని చెప్పారని అన్నారు. షుజా చెప్పిన వివరాలు తనకు సైన్స్ ఫిక్షన్ స్టోరీలా అనిపించాయని, ఏదిఏమైనా ఆయన చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాల్సిందేనని కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ డిమాండ్ చేశారు.