అంతర్జాతీయం

ఆగిపోయన శాంతి ప్ర క్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: భారత్, పాకిస్తాన్‌ల మధ్య శాంతి ప్రక్రియ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆగిపోయిందని భారత్‌లో పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్ గురువారం అన్నారు. రెండు దేశాల మధ్య ఇప్పటికైతే ఎలాంటి చర్చల ప్రతిపాదనలు లేవని ఆయన అన్నారు. విదేశీ విలేకరుల క్లబ్‌లో జరిగిన సమావేశంలో, ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశం ఎప్పుడు జరుగుతుందన్న ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. ‘‘ ఇప్పటికైతే ఎలాంటి చర్యలు ఖరారు కాలేదు. ప్రస్తుతానికి చర్చల ప్రక్రియ ఆగినట్లే’ అని బాసిత్ స్పష్టం చేశారు. అన్ని అంశాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని తాము కోరుకుంటున్నట్లు బాసిత్ వెల్లడించారు. పఠాన్‌కోట్ దాడి దర్యాప్తులో పాక్ బృందం అడ్డం తిరిగిన తరువాత ఆ దేశం తరపున వెల్లడైన తొలి అధికారిక ప్రకటన ఇదే. పఠాన్‌కోట్ దాడి జరిగినప్పటి నుంచీ రెండు దేశాల మధ్య అన్ని రకాల శాంతి ప్రక్రియలకు తెరపడిన సంగతి తెలిసిందే. భారత్ గూఢచారి అని ఆరోపిస్తూ పాకిస్తాన్ అరెస్టు చేసిన కుల్‌భూషన్ యాదవ్‌ను కలిసేందుకు భారత్ చేసిన విజ్ఞప్తి పరిశీలనలో ఉందని బాసిత్ తెలిపారు. విదేశీ సంబంధాలున్న చాలామంది ఉగ్రవాద ఆపరేటర్లను గత నెలరోజుల్లో పాకిస్తాన్ అరెస్టు చేసిందని బాసిత్ వెల్లడించారు.