అంతర్జాతీయం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కిలోన్నర బంగారం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని పట్టుకున్నారు. కెన్యాకు చెందిన దంపతుల నుంచి కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన వీరి వద్ద బంగారం ఉండటాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అయితే వారి వద్ద బంగారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో దంపతులను అదుపులోకి తీసుకొని, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వారంలో ఇలా బంగారం పట్టుబడడం ఇది రెండవసారి. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ఆ దంపతులను శంషాబాద్ పోలీసులకు అప్పజెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు శంషాబాద్ డిసిపి తెలిపారు.