అంతర్జాతీయం

నేపాల్‌కు రిపబ్లిక్‌డే బహుమతులు అందజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, జనవరి 26: నేపాల్‌కు భారత్ గణతంత్ర దినోత్సవ బహుమతులు అందజేసింది. నేపాల్‌కు 30 అంబులెన్స్‌లు, ఆరు బస్సులను భారత్ అందచేసింది. 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేపాల్‌లోని భారత రాయబారి మంజీవ్ సింగ్ పూరి అంబులెన్స్, బస్సుల తాళాలు అధికారులకు ఇచ్చారు. ఖాట్మండులోని భారత ఎంబసీ వద్ద రిపబ్లిక్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. నేపాల్‌లో విద్య, వైద్యం కోసం భారత్ వివిధ రకాలుగా సహాయ, సహకారాలు అందిస్తోంది. 1994 నుంచి ఇప్పటి వరకూ 722 అంబులెన్స్‌లు, 142 బస్సులు నేపాల్‌కు బహుమతిగా అందజేసింది. గూర్ఖా రెజిమెంట్‌కు చెందిన యుద్ధవీరుల కుటుంబాలకు రాయబారి పూరి నగదు బహుమతిగా ఇచ్చారు. 53 పాఠశాలలు, లైబ్రరీలకు పుస్తకాలు అందజేశారు. ఖాట్మండులోని రాయబార కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్రపతి కోవింద్ ప్రసంగాన్ని చదివి వినిపించారు. నేపాల్ అభివృద్ధి, వికాసానికి భారత్ అండదండలు అందిస్తుందని ఆయన ప్రకటించారు. ఇండియన్ ఎంబసీ ఉద్యోగులతోపాటు 2000 మంది గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్నారు. నేపాల్‌లో ఉంటున్న భారతీయులు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధులు, విద్యార్థులు హాజరయ్యారు.