అంతర్జాతీయం

బ్రెజిల్‌లో కూలిన డ్యామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రుమాడినో, జనవరి 26: బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ డ్యామ్ కూలిపోయి తొమ్మిది మంది మృతి చెందారు. 300 మంది గల్లంతయ్యారు. ఏడు మృతదేహాలను వెలికి తీసినట్టు అధికారులు వెల్లడించారు. బెలోహారిజొంటే నగరంలో ఈ విషాదం జరిగింది. ఎగువ ప్రాంతం నుంచి ఇనుమ రజనుతో వచ్చిన బూడిద ధాటికి డ్యామ్ కూలిపోయినట్టు స్థానిక గవర్నర్ తెలిపారు. మినాస్ గెరియాస్ రాష్ట్రంలో శుక్రవారం అర్థరాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శనివారం తెల్లవారే సరికి ప్రమాదం వార్త తెలిసింది. తొమ్మిది మంది చనిపోగా, 300 మంది గల్లంతయ్యారు. ప్రాణనష్టం పెరగవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్యామ్ పక్కనే పనిచేస్తున్న ఓ కంపెనీకి ఉద్యోగులు 150 మంది ఆచూకీ తెలియకుండాపోయింది. డ్యామ్‌కు ఆనుకుని ఉన్న వాలే గనిలో ప్రమాదం జరిగే సమయంలో 427 మంది కార్మికులు పనిచేస్తున్నారని మినాస్ గెరియాస్ గవర్నర్ రోమియో జెమా వెల్లడించారు. 279 మంది ప్రాణాలతో బయటపడ్డారని ఆయన అన్నారు. మిగతావారి ఆచూకీ తెలియకుండాపోయిందని ఆయన అన్నారు. బ్రుమేడినో పట్టణం నుంచి వచ్చిన ఇనుపరజనుతో కూడిన బూడిద వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. రహదారులు, ఫామ్‌హౌస్‌లు, ఇళ్లు ధ్వంసమయ్యాయని అన్నారు. వంద అగ్నిమాపక దళాలు, అధికారులు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు.

చిత్రాలు..బ్రెజిల్‌లోని బ్రుమాడిన్హో వద్ద కొట్టుకుపోయన డ్యామ్. నీటిలో మునిగిన పరిసర ప్రాంతాలు.