అంతర్జాతీయం

రెచ్చగొడితే..సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూలై 14: దక్షిణ చైనా సముద్రంలోని వ్యూహాత్మక ప్రాంతానికి సంబంధించి తనకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి ఏ దేశమైనా, ఎలాంటి రెచ్చగొట్టే చర్యకు దిగినా తాను నిర్ణాయక రీతిలో స్పందించాల్సి వస్తుందని చైనా గురువారం హెచ్చరించింది. ‘ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగా ఎవరైనా చైనా భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే చర్యకు దిగితే చైనా తిరుగులేని రీతిలో స్పందిస్తుందని నేను గట్టిగా చెప్పదలచుకున్నాను’ అని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లుకాంగ్ ఇక్కడ విలేఖరులకు చెప్పారు. పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (పిసిఎ) ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రభావం గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన బదులిస్తూ గత ఫిలిప్పీన్స్ ప్రభుత్వం చేసిన అక్రమ విజ్ఞప్తి ఆధారంగా ఆ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారని, అందువల్ల అది అక్రమమని ఆయన అన్నారు.
చైనా ప్రస్తుత విధానంపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రభావం ఏమాత్రం ఉండబోదని ఆయన వివరించారు. ట్రిబ్యునల్ తీర్పుపై చైనా మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దక్షిణ చైనా సముద్రంలో చైనా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అమెరికా, జపాన్‌లపై చైనా అధికార మీడియా గురువారం విరుచుకుపడింది. అమెరికా, జపాన్‌లను ‘కాగితపు పులులు’గా, ‘నపుంసకులు’గా అభివర్ణించింది. చైనా తనవిగా పేర్కొంటున్న దక్షిణ చైనా సముద్రంలోని ద్వీపకల్పాల సమీపంలో ట్రిబ్యునల్ తీర్పును అమలు చేయడానికి అమెరికా యుద్ధనౌకలు విన్యాసాలకు దిగితే ప్రతి దాడి చేయడానికి చైనా మిలిటరీ సిద్ధంగా ఉండాలని చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ నడుపుతున్న దిన పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ తన సంపాదకీయంలో చైనా ప్రభుత్వానికి సూచించింది.