అంతర్జాతీయం

భద్రతతో ముడిపెట్టొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస, జనవరి 26: ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు వాతావరణ మార్పుల్లో సమతుల్యత సాధించేందుకు అన్ని దేశాలు ఉమ్మడిగా కృషి చేసేందుకు ఐరాస చర్యలు తీసుకోవాలని ఐరాసలో భారత్ తరఫున శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ అన్నారు. ఆయన ఐరాసలో వాతావరణంలో వస్తున్న మార్పులు, ప్రకృతివిపత్తు, అంతర్జాతీయ శాంతి, భద్రత అనే అంశాలపై జరిగిన సదస్సులో ప్రసంగించారు. ఎటువంటి విపత్తు సంభవించినా ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు సమాయత్తం కావాలన్నారు. ప్రజల అవసరాలను కాపాడాలన్నారు. మానవాళికి ముప్పుగా పరిణమించే విధంగా పర్యావరణ విధ్వంసాన్ని కొనసాగనివ్వరాదన్నారు. కొన్ని చోట్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెప్పారు. అంతర్జాతీయంగా వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. దీనికి తోడు ప్రపంచ దేశాల్లో భద్రత కూడా ఒక సమస్యగా పరిణమించిందన్నారు. అంతర్జాతీయంగా శాంతిని పరిరక్షించేందుకు భద్రత ఉండాలన్నారు. ఈ విషయంలో అన్ని దేశాలను భాగస్వాములను చేయాలన్నారు. పర్యావరణ విధ్వంసం వల్ల వచ్చే వాతావరణ మార్పులను పరిగణనలోకి తీసుకుని అన్ని దేశాలను భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి దేశాన్ని భాగస్వామిని చేయాలన్నారు.