అంతర్జాతీయం

ఆనకట్ట ప్రమాదంలో 40కి చేరిన మృతుల సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రూమడిన్హో (బ్రెజిల్), జనవరి 27: బ్రెజిల్‌లో ఆనకట్ట కుప్పకూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 40కు చేరిందని, గల్లంతైన వందలాది మంది జాడ ఇంకా తెలియరాలేదని అధికారులు తెలియజేశారు. గల్లంతైన వారందరూ మృతి చెంది ఉండవచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇనుప ఖనిజం వ్యర్థాలు, బురద కిలోమీటర్ల మేర పేరుకుపోయాయి. శనివారం రాత్రి బ్రెజిల్‌లోని మినాస్ గేరియాస్ రాష్ట్రంలోని బ్రూమడిన్హో సమీపంలో పరావోపేట నదిపై నిర్మించిన ఆనకట్ట హఠాత్తుగా కుప్పకూలడంతో తొలుత 8 మంది మృతి చెందారని, 300 మంది గల్లంతయ్యారని అధికారులు ప్రకటించారు. ఇనుప ఖనిజం తవ్వుతున్న వలే అనే కంపెనీ ఆధ్వర్యంలో ఈ డ్యామ్ ఉండగా, ప్రమాదంలో ఆ కంపెనీకి చెందిన వారే ఎక్కువ బాధితులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్‌ఫైటర్స్, ఇతర శాఖల అధికారులు చేపట్టిన పలు రక్షక చర్యల అనంతరం మృతుల సంఖ్య 40గా నిర్ధారించారు. గల్లంతైన 300 మంది జాడ తెలియరాలేదు. వీరంతా మృతి చెంది ఉండవచ్చునని వారు భావిస్తున్నారు. పేరుకుపోయిన బురదలో ఎవరైనా చిక్కుకుపోయారా, మృతదేహాలు ఉన్నాయా అని రాత్రి నుంచి సహాయ సిబ్బంది వెతుకుతున్నారు. సహాయ కార్యక్రమాల్లో హెలికాప్టర్లు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. ఖనిజ వ్యర్థాలు, బురద కిలోమీటర్ల మేర ఆవరించాయి. తమ వారి జాడ ఏమైందో తెలియక గల్లంతైన వారి కుటుంబాలు అల్లాడుతున్నాయి. అధికారులు తమకు సరిగ్గా వివరాలు తెలియజేయడం లేదని, తమ వారు బతికున్నారో, చనిపోయారో చెప్పాలని వారు వేడుకుంటున్నారు. మినాస్ జార్జియస్ స్టేట్ గవర్నర్ రోమియ్‌జెమా సహాయ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.