అంతర్జాతీయం

పాక్ తొలి మహిళా హిందూ జడ్జిగా సుమన్ కుమారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్/కరాచీ, జనవరి 29: పాకిస్తాన్‌లో తొలి హిందూ సివిల్ జడ్జిగా సుమన్ కుమారి నియమితులు కానున్నారు. పాక్‌లోని సింధ్ ప్రాంతం క్వాంబర్ షాహ్‌దత్‌కోట్‌కు చెందిన సుమన్ కుమారి హైదరాబాద్‌లో ఎల్‌ఎల్‌బీ చేశారు. అనంతరం లాలో మాస్టర్స్ కోర్సును కరాచీలోని జాబిస్ట్ యూనివర్సిటీలో పూర్తి చేశారు.
‘నా సొంత ప్రాంతమైన వెనుకబడిన సింధ్‌లో పేద ప్రజలకు న్యాయపరంగా సలహాలు, సహకారం అందించేందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నాను’ అని ఆమె పీటీఐ ప్రతినిధితో టెలిఫోన్ సంభాషణ ద్వారా అన్నారు. ‘మహిళలు అంతగా ఆసక్తి చూపని న్యాయరంగం వైపు దృష్టి సారించేందుకు మా నాన్నతోపాటు మా కుటుంబ సభ్యులు ఎంతో మద్దతుగా నిలిచారు’ అని ఆమె పేర్కొన్నారు. ‘సుమన్ కుమారి తండ్రి డాక్టర్ పవన్ కుమార్ బోదన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తన కుమార్తె హిందూ సమాజంలో న్యాయ సహాయం కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది పేదలకు ఉచిత సహాయం అందించేందుకు ముందుకు రావాలని అభిలషించారు. ‘న్యాయవాద వృత్తిని సుమన్ ఒక చాలెంజ్‌గా ఎంచుకుంది. ఎక్కడ పనిచేసినా తన నిజాయితీ, కష్టపడే తత్వంతో ఆమె తప్పనిసరిగా నెగ్గుకు రాగలదు’ అని డాక్టర్ పవన్ కుమార్ అన్నారు. సుమన్ కుమారి తండ్రి కంటి వైద్యనిపుణుడు కాగా, ఆమె అక్కలో ఒకరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా, మరొకరు చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. కాగా, సుమన్ కుమారి ప్రముఖ గాయనీ గాయకులు లతా మంగేష్కర్, అతిఫ్ అస్లామ్‌లకు అభిమాని కావడం విశేషం. హిందూ సమాజంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యాపరంగా ఎదిగేందుకు, బాధ్యతగల వ్యక్తులుగా నిలబడే దిశగా ప్రోత్సహించాలని సుమన్ కుమారి హితవు పలికారు. ఇదిలావుండగా, పాకిస్తాన్‌లో ఒక హిందూ సమాజానికి చెందిన వ్యక్తి జడ్జిగా నియమితులు కావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు తొలిసారిగా జస్టిన్ రాణా భగవాన్‌దాస్ పాకిస్తాన్ తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా 2005 నుంచి 2007 వరకు పనిచేశారు.
ముస్లింలు ఎక్కువగా ఉన్న పాక్‌లో హిందువులు కేవలం రెండు శాతం మాత్రమే ఉన్నారు. కాగా, గత ఏడాది పాకిస్తాన్ జనరల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో హిందూ మతానికి చెందిన మహేష్ కుమార్ మలానీ తొలిసారిగా ముస్లిమేతర వ్యక్తిగా జనరల్ సీటు నుంచి ఎన్నికయ్యారు. అదేవిధంగా తహ్రీ, కృష్ణ కుమారి అనే ఇద్దరు హిందూ మహిళలు సైతం పాకిస్తాన్ సెనేట్‌కు జరిగిన ఎలక్షన్‌లో ఎన్నికయ్యారు. ఈ ఇద్దరు హిందూ మహిళలకు పాక్‌లోని అధికార పార్టీ సింధ్ ప్రాంతం నుంచి టికెట్‌లు ఇచ్చింది.