అంతర్జాతీయం

బుర్హాన్ ఓ సమరయోధుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 14: భారత భద్రతాదళాల చేతుల్లో హతమైన హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ, అతని సహచర మిలిటెంట్లు స్వాతంత్య్ర సమరయోధులని పాకిస్తాన్ శ్లాఘించింది. కాశ్మీర్‌లో భారత్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నదని.. అందులో కీలక పాత్ర పో షిస్తున్న భారత భద్రతా బలగాలతో జరిగిన పోరాటంలో బుర్హాన్‌వనీ వీరమరణం పాలయ్యాడని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయ ప్రతినిధి నఫీస్ జకరియా గురువారం పేర్కొన్నారు. భారత బలగాలు చేస్తున్న ఈ పనులను అంతర్జాతీయ సమాజం గమనించాలని ఆయన డిమాండ్ చేశారు. యూరోపియన్ యూనియన్, పీ-5 దేశాల సమూహం, ఓఐసి, ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలకు భారత భద్రతాబలగాలు చేస్తున్న అరాచకాలు, కాశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘనల గురించి సమాచారం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ‘‘ ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం కాశ్మీర్‌పై ఒప్పందం జరగాలని పాకిస్తాన్ కోరుకుంటోంది. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని మీరు కోరుకుంటే అది మీ ఇష్టం.’’ అని నఫీస్ జకరియా అన్నారు. కాశ్మీర్ సహా అన్ని అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ‘‘కాశ్మీర్ కోసం మేం యుద్ధాలు చేశాం. చర్చలు కూడా జరిపాం అయినా ఎలాంటి ఫలితం రాలేదు.
అందువల్లే కాశ్మీర్‌పై ఒప్పందానికి పాకిస్తాన్‌తో చర్చలు జరిపేలా అంతర్జాతీయ సమాజం భారత్‌పై ఒత్తిడి తీసుకువచ్చి ఒప్పించాలి’’ అని జకరియా డిమాండ్ చేశారు. ఐక్యరాజ్యసమితి తీర్మానాలను మాటిమాటికీ ఉల్లంఘిస్తున్న భారత్‌కు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి ఎంతమాత్రం అర్హత లేదని ఆయన అన్నారు.