అంతర్జాతీయం

ఉగ్రవాదుల్ని వెనకేసుకొస్తున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూలై 14: హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీని స్వాతంత్య్ర సమరయోధుడిగా పాక్ అభివర్ణించటం, ఇది రాజ్యాంగం ముసుగులో భారత ప్రభుత్వం చేసిన హత్యగా అంతర్జాతీయ వేదికలపే ప్రేలాపనలు చేయటంపై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. దాయాది దేశం కాశ్మీర్‌లో విద్వేషాన్ని రెచ్చగొడుతోందని ఆరోపించింది. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ గురించి మాట్లాడే ఎలాంటి అర్హతా పాకిస్తాన్‌కు లేదని భారత్ స్పష్టం చేసింది. కాశ్మీర్‌లో ఉగ్రవాదుల చర్యలను మెచ్చుకోవటం, వారిని వీరులుగా పేర్కొనటం, ఇతర దేశాల భూభాగాల్లోకి చొరబడి కోవర్టు చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతోందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఘాటుగా స్పందించారు. బుధవారం జరిగిన 193 దేశాల సమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ దౌత్యవేత్త మలీహా లోధీ, భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. బుర్హాన్‌వనీని రాజ్యాంగం ముసుగులో హత్య చేశారని ఆరోపించారు. వనీ ని కాశ్మీర్ నాయకుడిగా అమె అభిర్ణించారు. కాశ్మీర్‌లో భారత భద్రతాబలగాలు మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయనటానికి ఇది తాజా ఉదాహరణ అని ఆమె విమర్శించారు. దీనిపై అక్బరుద్దీన్ ఘాటుగానే జవాబిచ్చారు. ఐక్యరాజ్యసమితి వేదికను పాకిస్తాన్ పదేపదే దుర్వినియోగం చేస్తోందని అన్నారు. ‘ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, ఉగ్రవాదాన్ని దేశ జాతీయ విధానంగా మార్చుకోవటం, టెర్రరిస్టులను పొగడటం పాక్ నైజంగా మారింది. చాలా సంవత్సరాలుగా పాక్ దుశ్చర్యలను అంతర్జాతీయ సమాజం గమనిస్తోందని’ అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు.

చిత్రం.. భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్