అంతర్జాతీయం

దక్షిణ సూడాన్‌కు రెండు సైనిక విమానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: ఘర్షణలతో యుద్ధ్భూమిలా మారిన దక్షిణ సూడాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత్ రెండు సైనిక విమానాలను పంపింది. దక్షిణ సూడాన్ రాజధాని జుబాలో చిక్కుకున్న 300మంది భారతీయులను అక్కడినుంచి తరలించేందుకు రెండు సైనిక విమానాలను పంపినట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. నిరంతర ఘర్షణలతో రోజురోజుకూ పరిస్థితి మారిపోతున్న దృష్ట్యా తక్షణం అక్కడినుంచి కదిలిరావాలని దక్షిణ సూడాన్‌లోని భారతీయులకు ఆమె పిలుపునిచ్చారు. పరిస్థితి చేయిదాటిపోతే తరలించలేని పరిస్థితి ఏర్పడుతుందని కూడా సుష్మా వారికి స్పష్టం చేశారు. ఆపరేషన్ సంకట్‌మోచన్‌లో భాగంగా కేంద్ర మంత్రి వి.కె.సింగ్ బృందం జుబాకు చేరుకుందని, ఘర్షణలు మరింత తీవ్రం కాకముందే అక్కడినుంచి కదలాలని సూచించారు. కేంద్ర మంత్రి వి.కె.సింగ్, విదేశాంగ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అమర్‌సిన్హా, జాయింట్ సెక్రటరీ సత్బీర్‌సింగ్, డైరెక్టర్ అంజని కుమార్‌తో కలిసి గురువారం తెల్లవారుజామున దక్షిణ సూడాన్‌కు బయలుదేరారు. జుబాలోని భారతీయులను తీసుకువచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తామని వి.కె.సింగ్ వెల్లడించారు. కాగా, దక్షిణ సూడాన్‌లో 600మంది భారతీయులు నివసిస్తున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. వారిలో 450మంది రాజధాని జుబాలోనూ, 150మంది శివార్లలోనూ నివసిస్తున్నారని పేర్కొంది. అక్కడినుంచి తరలివచ్చేందుకు ఇప్పటివరకు 300మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.