అంతర్జాతీయం

మీరెందుకొచ్చారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఫిబ్రవరి 9: భారత ప్రధాని నరేంద్రమోదీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మోదీ పర్యటన దెబ్బ తీస్తుందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హు ఛున్యాంగి అన్నారు. సరిహద్దు సమస్య మరింత జటిలం అవుతుందని కూడా చైనా వాదిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ అరుణాచల్‌ప్రదేశ్‌లో శనివారం అడుగుపెట్టిన వెంటనే చైనా తీవ్రంగా స్పందించింది. రూ. 4000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. సరిహద్దు రాష్టమ్రైన అరుణాచల్‌ను మరింత అభివృద్ధి చేయడం ద్వారా మిగతా ప్రాంతలకు అనుసంధానం చేయాలని కేంద్రం భావిస్తోంది. జాతీయ రహదారులు, రైల్వే, విమానయానం, విద్యుత్ ఉత్పత్తి రంగాలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు. చైనా విమర్శలపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. అరుణాచల్‌ప్రదేశ్ భారత్ అంతర్భాగమని ప్రకటించింది. ‘ఎప్పుడు అవసరమైతే అప్పుడు మా నాయకులు అరుణాచల్‌లో పర్యటిస్తారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతోపాటే దీన్ని చూస్తున్నాం. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో చైనాకు స్పష్టం చేశాం’ అని భారత్ స్పష్టం చేసింది. అయితే ఇరుదేశాల మధ్య సున్నితమైన సరిహద్దు సమస్యను మరింత జటిలం చేయవద్దని చైనా స్పష్టం చేసింది. దీని వల్ల ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఈశాన్య రాష్టమ్రైన అరుణాచల్‌ప్రదేశ్ టిబెట్‌లో అంతర్భాగమని బీజింగ్ పాలకులు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. అరుణాచల్ దక్షిణ టిబెట్‌కు చెందుతుందని చైనా చెబుతోంది. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్- చైనా మధ్య 21 సార్లు చర్చలు జరిగాయి. వాస్తవాధీన రేఖ పొడవు 3,488 కిలోమీటర్లు. కాగా అరుణాచల్ ప్రదేశ్‌లో భారత నేతలు ఎప్పుడు పర్యటనకు వచ్చినా అభ్యంతరం తెలపడం చైనాకు మామూలైపోయింది.

చిత్రం.. రణగర్ సభలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ