అంతర్జాతీయం

విదేశీ పర్యటనలకు అనుమతి నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 9: విదేశాలకు విమానాల్లో వెళ్లకుండా విత్ హెల్డ్ జాబితాలో ఉన్న తమ పేర్లను తొలగించాలని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె, అల్లుడు చేసిన వినతిని పాకిస్తాన్ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ పేర్లను ఎగ్జిట్ కంట్రోల్ లిస్టులో ఉంచుతారు. గత ఏడాది అక్టోబర్ నెలలో నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం, అల్లుడు మహమ్మద్ సఫ్ధర్‌లు తమ పేర్లను జాబితాలో నుంచి తొలగించాలని పాక్ ప్రభుత్వాన్ని కోరారు. తాము అవినీతి, అధికార దుర్వినియోగం కేసుల్లో లేనందు వల్ల ఈ జాబితాలో తమ పేర్లను ఉంచరాదని వారు కోరారు. 2010లో వచ్చిన కొత్త నిబంధనలు తమకు వర్తించవన్నారు. వీరి పేర్లను విత్ హెల్త్ జాబితాలో కొనసాగించాలని, నిషేధం ఎత్తివేయకుండా అలాగే ఉంచాలని పాక్ మంత్రిమండలి గత ఏడాది నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జూలైలో పాక్‌లో అకౌంబులిటీ కోర్టు మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ను అవినీతి ఆరోపణల కేసులో శిక్షిస్తూ తీర్పు ఇచ్చింది. నవాజ్ షరీప్‌ను ఏడేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చారు. కాట్ లకాపెట్ జైలులో షరీఫ్ శిక్షను అనుభవిస్తున్నారు.