అంతర్జాతీయం

చైనాలో రోడ్డు ప్రమాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఫిబ్రవరి 10: నూతన సంవత్సర వేడుకలు ముగించుకుని ఇళ్లకు లక్షలాది మంది వెళ్తున్న నేపథ్యంలో చైనాలో మంచుతో కూడుకున్న జాతీయ రహదారులపై జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 15 మంది మృతి చెందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అన్హుయ్ ప్రాంతంలోని ఆంక్వింగ్ పట్టణంలో ఆదివారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మూడు గంటల తర్వాత హెఫెయ్ ప్రాంతం ఒక మినీబస్సు.. ప్రయాణికుల వాహనాన్ని ఢీకొంది. గుజిహౌ ప్రాంతంలో ఎదుట ఏముందో తెలియని పరిస్థితుల్లో వంద వాహనాల వరకు ప్రమాదానికి గురయ్యాయి.. ఒక దానిని ఒకటి ఢీకొన్నాయి. ఇలా జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. అందులో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. హెఫెయ్, గుజిహౌ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా మంచు వర్షం కురుస్తోంది. హైవేలపై మంచు పేరుకుపోయింది. ముందు ఏమున్నదో కనబడని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఎదుట వస్తున్న వాహనాలు కన్పించక ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.