అంతర్జాతీయం

అమెరికా బలగాల నిర్వహణ ఖర్చు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, ఫిబ్రవరి 10: తమ దేశంలో ఉన్న అమెరికా బలగాలకు నిర్వహణ ఖర్చులను పెంచుతున్నట్టు సియోల్ ఆదివారం ప్రకటించింది. అమెరికా, ఉత్తర కొరియా మధ్య జరిగిన రెండవ ద్వైపాక్షిక ఒప్పందం తర్వాత దేశరక్షణ నిమిత్తం చిరకాలంగా సియోల్‌లో అమెరికా దళాలు ఉన్నాయి. 1950-53 మధ్య జరిగిన కొరియన్ యుద్ధం నేపథ్యంలో రెండు దేశాల మధ్య రక్షణ ఒప్పందం కొనసాగుతూ వస్తోంది. దీనిలో భాగంగా 28వేల అమెరికా భద్రతా దళాలు సియోల్‌లోని దక్షిణ ప్రాంతంలో మోహరించి శత్రు దేశాల నుంచి రక్షణ కల్పిస్తున్నాయి. అయితే తమ సైనికుల మోహరింపు నిమిత్తం తమకు ఖర్చులు ఎక్కువైపోతున్నాయని, అందువల్ల నిర్వహణ ఖర్చులను రెట్టింపు చేయాలని అమెరికా అధ్యక్షుడు సియోల్‌ను డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణకొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖతో జరిపిన చర్చల్లో 2019 సంవత్సరం సైనికుల ఖర్చు నిమిత్తం 1.04 ట్రిలియన్ వాన్ (924 మిలియన్ యూఎస్ డాలర్లు) చెల్లిస్తామని అంగీకరించారు. గత ఏడాది డిసెంబర్‌తో పూర్తయిన ఐదేళ్ల ఒప్పందం కన్నా ఈ మొత్తం 8.2 శాతం ఎక్కువ. సైనికుల నిర్వహణ నిమిత్తం కేటాయింపులను పెద్దమొత్తంలో పెంచమని అమెరికా డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని వారు పేర్కొన్నారు. కొరియన్ ద్వీపకల్పం రక్షణ పరిస్థితుల దృష్ట్యా అమెరికా-ఉత్తర కొరియాల మధ్య రక్షణపరమైన ఒప్పందాల ఆవశ్యకత, అవసరం చాలా ఉందని, ఈ నేపథ్యంలో సియోల్‌లో అమెరికా దళాలను ఉంచాల్సిందేనని ఒప్పందం అనంతరం కొరియా ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు. శాంతిపరమైన ఒప్పందంలో భాగంగా దశాబ్దాల తరబడి నెలకొన్న యుద్ధ వాతావరణానికి తెరతీయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చర్చలు జరిపి అధికారిక ప్రకటన చేస్తారన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. వీరి మధ్య ద్వైపాక్షిక చర్చలు గత ఏడాది సింగపూర్‌లో జరుగగా, రెండోసారి చర్చలు హనోయ్‌లో ఈ నెలలో జరగనున్నాయి.