అంతర్జాతీయం

దాడికి మేం కారణం కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 15: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రదాడికి కారణం పాకేనంటూ ప్రపంచదేశాలన్నీ వేలెత్తి చూపుతున్నా.. తనకే పాపం తెలియదని.. తాము అమాయకులమని నమ్మించడానికి ప్రయత్నిస్తోంది ఆ దేశం. గురువారం భారత్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని పాకిస్తాన్ దేశం ఒకపక్క ఖండిస్తూనే.. ఆ దాడికి తమ దేశం కారణమంటూ భారత్ చేస్తున్న ఆరోపణలను తిరస్కరించింది. అందులో తమకెలాంటి సంబంధం లేదని.. అయినా.. ఎలాంటి దర్యాప్తు జరపకుండానే భారత్ ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొంది. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జైష్-ఈ-మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థ గురువారం జరిపిన ఈ దాడిలో భారత్‌కు చెందిన జవానులు 40 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడి జరిగిన తర్వాత చాలాసేపు వౌనంగా ఉన్న పాకిస్తాన్ విదేశాంగ శాఖ గురువారం అర్థరాత్రి ఎట్టకేలకు దానిపై నోరువిప్పింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ భారత్‌లో జరిగిన ఉగ్రవాద దాడి ఉపేక్షించ రానిదని, కాశ్మీర్ లోయలో ఇలాంటి హింసాత్మక సంఘటనలను తాము ఎప్పుడూ ఖండిస్తూ వస్తున్నామని పేర్కొంది. ఈ దాడితో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ సంఘటనపై దర్యాప్తు ఇంకా పూర్తి కాకుండానే భారత్‌కు చెందిన మీడియా, భారత ప్రభుత్వం తామే దీనికి కారణమంటూ ప్రచారం చేయడాన్ని తాము ఖండిస్తున్నామని తెలియజేసింది. కాగా, ఉగ్రదాడి అనంతరం దానికి తామే కారణమంటూ జేఈఎం ప్రకటించిన నేపథ్యంలో ఉగ్రవాదులకు సహకరించడం నిలిపివేయాలని, వారి దేశం కేంద్రంగా చేసుకుని ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని భారత్ ప్రభుత్వం పాక్‌ను హెచ్చరించింది. అంతేకాకుండా జేఈఎం సంస్థ చీఫ్ మసూద్ అజార్‌ను పేరుమోసిన ఉగ్రవాదుల జాబితాలో ఉంచాలని భారత్ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిపై ఇతర దేశాలతో కలిసి ఒత్తిడి తెస్తోంది. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇలాంటి సంస్థలను నిషేధించాలని కోరుతూ వస్తోంది. ఇలావుండగా, ఉగ్రదాడిని అమెరికా దేశం ఖండించింది. ఉగ్రవాద సంస్థలకు స్వర్గ్ధామంలా మారిన పాక్ ఇకనైనా వారికి మద్దతు ఇవ్వడం మానుకోవాలని ఆ దేశాన్ని అమెరికా హెచ్చరించింది. ఈ మేరకు అమెరికా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉగ్రవాదంపై పోరు విషయంలో తాము పూర్తి అంకితభావంతో ఉన్నామని, ఈ విషయంలో తాము భారత్‌కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు.