అంతర్జాతీయం

మసూద్ అజార్‌పై మళ్లీ చైనా దాటవేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఫిబ్రవరి 15: తాజాగా కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలోనూ చైనా పాకిస్తాన్‌ను వెనకేసుకుని రావడం మానలేదు. ఈ దాడికి పాల్పడిన జైషేమహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ డిమాండ్‌పై మరోసారి దాటవేత వైఖరిని అవలంభించింది. కాశ్మీర్‌లో పుల్వానా ఉగ్రవాద ఘటనపై చైనా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనలో మృతి చెందిన గాయపడిన జవానుల కుటుంబాలకు చైనా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. చైనా ప్రతినిధి జెంగ్ షుంగ్ మాట్లాడుతూ ఈ ఘాతుకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా చైనా సహించదన్నారు. ఐక్యరాజ్యసమితి కమిటీ ఆంక్షల జాబితాలో ఈ ఉగ్రవాద సంస్థ ఉందని ఆయన చెప్పారు. ఐరాస జాబితాలో చేర్చేందుకు చైనా మద్దతు ఇవ్వకపోవడానికి కారణాలపై మాట్లాడేందుకు ఆ ప్రతినిధి నిరాకరించారు. ఇప్పటికే భధ్రతా మండలి ఉగ్రవాదులపై ఆంక్షల జాబితాలో ఈ సంస్థను చేర్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఐరాస నిషేధ సంస్థల జాబితాలో జైషే మహ్మద్‌ను చేర్చినట్లయితే, ఈ సంస్థకు నిధులు రావని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రపంచ దేశాలకు తెలియచేస్తోంది. కాగా ఉగ్రవాదాన్ని నిర్మూలించేవిషయమై మరో మాటకు తావులేదని చైనా పేర్కొంది. ఉపఖండంలో భారత్, పాకిస్తాన్ అనేవి రెండు ప్రధాన దేశాలని చైనా పేర్కొంది. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ప్రాంతీయ దేశాలు పరస్పర సమన్వయం, సహకారంతో పనిచేయాలని చైనా కోరింది.