రాష్ట్రీయం

ఆస్ట్రేలియాలో తెలుగు యువతి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 14: ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న ఓ తెలుగు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆరు నెలల వయస్సు గల తన కుమారుడితో సహా అపార్టుమెంటు భవనంపై నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు ఇక్కడికి సమాచారం అందింది. అయితే మృతురాలి తల్లిదండ్రులు ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తుండడంతో అక్కడి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిసింది. సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన రిటైర్డ్ టీచర్ గన్నారం గంగాధర్, ఇందిర దంపతుల కుమారుడు శ్రీనివాస్(30) ఆస్ట్రేలియాలోని మెల్‌బొర్న్ పట్టణంలో గల ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితమే ఆయన మెల్‌బొర్న్‌లో కొలువు దక్కించుకుని, సెలవుల్లో స్వస్థలమైన ఆర్మూర్‌కు వచ్చిపోతుండేవాడు. ఆరేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి చెందిన సుప్రజ(26) అనే యువతితో శ్రీనివాస్‌కు వివాహం జరిపించారు. వివాహం అనంతరం శ్రీనివాస్ తన భార్యకు వీసాను సమకూర్చి సుప్రజను కూడా మెల్‌బోర్న్‌కు తీసుకెళ్లాడు.
ఈ దంపతులకు ఆరు నెలల క్రితమే కుమారుడు పుట్టాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం సుప్రజ తన కుమారుడితో కలిసి అపార్ట్‌మెంట్ భవనంపై నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుందని గురువారం ఇక్కడికి సమాచారం అందింది. ఈ మేరకు శ్రీనివాస్ కూడా ఆర్మూర్‌లోని తన తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా విషయం తెలియజేయడంతో ఆయన తండ్రి గన్నారం గంగాధర్ గురువారం రాత్రి మెల్‌బోర్న్‌కు పయనం అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సుప్రజ మృతి పట్ల ఆమె తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, శ్రీనివాస్ తల్లిదండ్రులు మాత్రం అలాంటిదేమీ లేదని, తమ కొడుకు, కోడలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, సుప్రజ బలవన్మరణానికి గల కారణాలేమిటో తమకు అంతుచిక్కడం లేదని పేర్కొంటున్నారు. తన భార్య ఇందిర అస్వస్థతతో బాధపడుతున్నందున కోడలు మరణ వార్త గురించి ఆమెకు తెలియనివ్వకుండా తాను ఒక్కడినే మెల్‌బోర్న్‌కు వెళ్తున్నట్టు శ్రీనివాస్ తండ్రి గన్నారం గంగాధర్ తెలిపారు.

చిత్రం.. మెల్‌బోర్న్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సుప్రజ (ఫైల్‌ఫొటో)