అంతర్జాతీయం

ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు సంపూర్ణ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టే ఎలాంటి చర్యలకైనా తమ దేశం పూర్తిగా సమర్థిస్తుందని, సంపూర్ణ మద్దతు ఇస్తుందని అమెరికా జాతీయ సెక్యూరిటీ సలహాదారు జాన్ బోల్డన్ అన్నారు. జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో గురువారం పాకిస్తాన్‌కు చెందిన జైష్-ఏ-అహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందిన నేపథ్యంలో సానుభూతి వ్యక్తం చేసిన జాన్ బోల్టన్ ఈమేరకు భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం చేపట్టే ఎలాంటి చర్యలకైనా తాము పూర్తిగా మద్దతునిస్తూ సహకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మేము అండగా ఉంటాం. ఇదే తరుణంలో ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇవ్వవద్దు’ అని ఆయన అన్నారు. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇవ్వడాన్ని, ఏ రకంగానైనా సహాయ సహకారం కూడా ఇవ్వరాదని ఆయన పాక్‌కు గట్టిగా హెచ్చరించారు. 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పాక్ ఉగ్రవాదులు బలిగొన్న నేపథ్యంలో ఈ దాడిని అగ్రరాజ్యమైన తమ దేశం తీవ్రంగా ఖండించిందని అంటూ తమ దేశం తరఫున సానుభూతిని వ్యక్తం చేశారు. ‘ఉగ్రవాదంపై ఎలాంటి పోరాడేందుకు తద్వారా దేశ రక్షణకు తీసుకునే ఎలాంటి చర్యలకైనా మా దేశం పూర్తి మద్దతు ఇస్తుంది. ఈ విషయమై భారత భద్రతా సలహాదారుతో ఇప్పటికే రెండుసార్లు మాట్లాడాను. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను’ అని అమెరికా భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ పేర్కొన్నారు. ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్న పాకిస్తాన్ పట్ల తమ దేశ వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశామని, ఇదే విషయమై నిరంతరం చర్చలు కూడా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. అంతకుముందు యూఎస్ వైట్‌హౌస్, సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మైక్ పోంపే మాట్లాడుతూ ఉగ్రవాదులకు ఆశ్ర యం, సహాయం తక్షణం విరమించుకోవాలని పాకిస్తాన్‌ను ఘాటుగా హెచ్చరించినట్టు తెలిపారు. అంతర్జాతీయంగా ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదులకు రక్ష ణ కల్పించవద్దని తాము స్పష్టం చేసినట్టు తెలిపారు.