అంతర్జాతీయం

మాకు చెప్పలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 17: భారత్ పాకిస్తాన్‌కు ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (ఎంఎఫ్‌ఎన్) హోదాను ఉపసంహరించుకున్న విషయాన్ని తమ దేశానికి తెలియచేయలేదని పాకిస్తాన్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి ఆదివారం తెలిపారు. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాద దాడి జరిగిన తరువాత భారత్ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా గట్టి ఆర్థికపరమయిన చర్య తీసుకుంది. పుల్వామాలో ఉగ్రవాద దాడి జరిగిన మరుసటి రోజు శుక్రవారం భారత్ పాకిస్తాన్‌కు గతంలో ఇచ్చిన ఎంఎఫ్‌ఎన్ హోదాను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. పాకిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే సరుకులపై దిగుమతి సుంకాన్ని 200 శాతం పెంచినట్టు, ఇది తక్షణమే అమలులోకి వచ్చినట్టు భారత్ శనివారం ప్రకటించింది. భారత్ ఎంఎఫ్‌ఎన్ హోదాను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించిన రెండు రోజుల తరువాత వాణిజ్య వ్యవహారాలపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సలహాదారు అయిన అబ్దుల్ రజాక్ దావూద్ మాట్లాడుతూ ఎంఎఫ్‌ఎన్ హోదాను ఉపసంహరించుకున్నట్టు భారత్ తమకు తెలపలేదని చెప్పినట్టు జియో న్యూస్ పేర్కొంది. ‘్భరత్ ఎంఎఫ్‌ఎన్ హోదాను ఉపసంహరించుకున్నట్టు చేసిన ప్రకటనను పరిశీలిస్తున్నాం. మేము ఈ అంశంపై భారత్‌తో మాట్లాడుతాము’ అని దావూద్ అన్నారు. పాకిస్తాన్ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) సహా వివిధ వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తుతుందని కూడా ఆయన తెలిపారు. ఎందుకంటే భారత్, పాకిస్తాన్ రెండు దేశాలూ డబ్ల్యూటీవో సభ్య దేశాలని ఆయన గుర్తుచేశారు.