అంతర్జాతీయం

జాదవ్ మరణశిక్ష రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిహేగ్, ఫిబ్రవరి 18: భారత జాతీఋడు కుల్‌భూషణ్ జాదవ్‌పై పాకిస్థాన్ సైనిక కోర్టు విధించిన మరణ శిక్షణు రద్దుచేసి ఆయనను వెంటనే విడుదల చేయాలని భారత్ డిమాండ్ చేసింది. జాదవ్‌పై పెట్టిన కేసులన్నీ తప్పులు తడకలని స్పష్టం చేసింది. భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌పై పాకిస్తాన్ మిలటరీ కోర్టు జరిపిన విచారం అశాస్ర్తియం, చట్టవ్యతిరేకమైందని అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ వాదించింది. ఈ విచారణ చెల్లుబాటు కాదన్న భారత్ తరఫున్యాయవాది దాన్ని కొట్టేయాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తిని కోరారు. కుల్‌భూషన్ జాదవ్(48) కేసుకు సంబంధించి హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో సోమవారం విచారణ ప్రారంభమైంది. జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. హేగ్ కోర్టులో నాలుగు రోజుల పాటు విచారణ జరగనుంది. జాదవ్‌పై పాక్ కోర్టు గూఢచర్య కేసు బనాయించింది. తొలిరోజు విచారణలో వియన్నా ఒప్పందం ఉల్లంఘన జరిగిందని భారత్ వాదించింది.‘అమాయకుడైన ఓ పౌరుడికి మరణ శిక్ష విధించడం అత్యంత దరుదృష్టకరం. పాక్ సైనిక కోర్టు విచారణ ఏకపక్షమే కాదు.. చట్టవ్యతిరేకమైంది’అని భారత తరఫుసీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే అన్నారు. ‘కుల్‌భూషణ్‌కు సంబంధించి పాకిస్తాన్ కట్టుకథ అల్లింది. దాన్ని ఆధారంగా లేనిపోని వన్నీ సృష్టించింది’అని మాజీ సోలిసిటర్ జనరల్ సాల్వే ఆరోపించారు. తన తరఫున న్యాయవాదితో కూడ మాట్లాడనీయకుండా ఏళ్ల తరబడి కస్టడీలో ఉంచడం చట్టవ్యతిరేకమేనని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. న్యాయవ్యవస్థకు సంబంధించి కనీస సూత్రాలను కూడా పట్టించుకుండా పాక్ సైనిక కోర్టు ఏకపక్షంగా విచారణ జరిపిందని ఆయన తెలిపారు. విశ్వసనీయమైన ఒక్క సాక్ష్యాన్ని పాక్ చూపించలేకపోయిందని హరీశ్ సాల్వే విమర్శించారు. కుల్‌భూషణ్‌కు ఉగ్రవాదంతోగానీ గూఢచర్యతో గాని సంబంధం ఉన్నట్టు ఒక్క ఆధారం లేదని అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. పాక్ సైనిక కోర్టులో విచారణ ఏకపక్షంగా సాగడమే కాకుండా వియన్నా ఒప్పందాన్ని దారుణంగా ఉల్లంఘించేదిగా ఉందని సాల్వే ఆరోపించారు. జాదవ్ వ్యవహారంలో భారత్ 13 సార్లు లేఖలు రాసినా పాక్ నుంచి స్పందనలేదని ఆయన వెల్లడించారు.2016 మార్చి 3న బలూచీస్థాన్‌లో జాదవ్‌ను అరెస్టు చేసినట్టు పాకిస్తాన్ చేస్తున్న వాదన పూర్తిగా అవాస్తవమని ఆయన అన్నారు. నేవీ నుంచి రిటైరైన తరువాత వ్యాపార పనుల నిమిత్తం జాదవ్ ఇరాన్ వెళ్లాడని భారత్ వాదించింది. ఇరాన్‌లోనే అతడని అరెస్టు చేసిన గూఢచర్యం కింద తప్పుడు కేసులు బనాయించారని ఆందోళన వ్యక్తం చేసింది.