అంతర్జాతీయం

కిడ్నాపర్ల చెరనుంచి శ్రీనివాస్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: నైజీరియాలో అపహరణకు గురైన భారతీయులు శ్రీనివాస్, అనీష్‌లను ఉగ్రవాదులు విడుదల చేసినట్లు నైజీరియాలో భారత హైకమిషనర్ బిఎన్ రెడ్డి తెలిపారు. శ్రీనివాస్, అనీష్ శర్మలను ఉగ్రవాదులు శనివారం ఉదయం విడుదల చేసినట్లు బిఎన్‌రెడ్డి ఢిల్లీలోని ఏపి భవన్ రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్‌కు సందేశం పంపించారు. ఉత్తర మధ్య నైజీరియా రాష్ట్రం బెన్యూలోని జిబోకే నుండి ఇద్దరు భారతీయులను ఉగ్రవాదులు గత నెల 29న అపహరించిన సంగతి తెలిసిందే. విశాఖపట్టణానికి చెందిన మంగిపూడి సాయి శ్రీనివాస్, ఆయన సహోద్యోగి అనీష్ శర్మను ఉగ్రవాదులు ఎత్తుకుపోయారు. శ్రీనివాస్ సివిల్ ఇంజనీర్‌గా జిబోకోలోని డానే్లట్ సిమెంట్ కార్మాగారంలో గత మూడేళ్లుగా పనిచేస్తున్నారు. వీరిని విడుదల చేయించాల్సిందిగా నైజీరియాలోని భారత హైకమిషనర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం, సిమెంట్ కర్మాగారం యాజమాన్యం చేసిన ఫలితాలు ఫలించి శ్రీనివాస్, అనీష్ శర్మలను ఉగ్రవాదులు విడుదల చేశారు. శ్రీనివాస్, అనీష్ శర్మ క్షేమంగా భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నారని ఢిల్లీలో ఏపి రెసిడెంట్ కమీషనర్ శ్రీకాంత్ తెలిపారు.