అంతర్జాతీయం

పాక్‌లో హఫీజ్ పార్టీపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 21: ముంబయిపై ఉగ్రవాద దాడి సూత్రధారి హఫీజ్ సరుూద్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దావా (జేయూడీ)ను పాకిస్తాన్ ప్రభుత్వం గురువారం నిషేధించింది.
జేయూడీ చారిటీ విభాగమయిన ఫలాహ్ ఎ ఇన్‌సానియత్ ఫౌండేషన్‌ను కూడా నిషేధించింది. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాద దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందిన తరువాత పాకిస్తాన్‌లోని మిలిటెంట్ గ్రూపులను అణచివేయాలని ప్రపంచ దేశాల నుంచి వచ్చిన తీవ్రమయిన ఒత్తిడి వల్ల పాక్ ఈ రెండు సంస్థలను నిషేధించింది. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన అతని కార్యాలయంలో గురువారం జరిగిన నేషనల్ సెక్యూరిటి కమిటి (ఎన్‌ఎస్‌సీ) సమావేశంలో ఈ గ్రూపులను నిషేధించాలనే నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్తాన్ హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. నిషిద్ధ సంస్థలకు వ్యతిరేకంగా చర్యలను వేగవంతం చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించినట్టు అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో వివరించారు. హోంమంత్రిత్వ శాఖ ఈ రెండు సంస్థలను నిషిద్ధ సంస్థలుగా నోటిఫై చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. అయితే, పాకిస్తాన్ రాజకీయ నాయకులు, భద్రతా సంస్థల నుంచి అప్రకటిత మద్దతు ఉన్న ఈ రెండు సంస్థలపై నిషేధం ఆచరణలో ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడవలసి ఉంది. పాకిస్తాన్ హోం మంత్రిత్వ శాఖ గతంలో ఈ రెండు సంస్థలను తన వాచ్‌లిస్ట్‌లో పెట్టింది.